నమాజు పట్ల నిర్లక్ష్యం యొక్క ప్రభావాలు

గురు, 12/12/2019 - 15:09

నమాజు పట్ల నిర్లక్ష్యం వలన కలిగే కొన్ని ప్రభావాలు.

నమాజు,నిర్లక్ష్యం,ప్రభావాలు.

నమాజు పట్ల నిర్లక్ష్యంగా ఉండటం మరియు దానిని తెలికగా తీసుకోవటం వలన కలిగే కొన్ని ప్రభావాలను దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక హదీసులో ఈ విధంగా ప్రస్థావిస్తున్నారు: ఎవరైతే నమాజు విషయంలో నిర్లక్ష్యం చేస్తారో మరియు దానిని తేలికగా తీసుకుంటారో వారిని ఆ భగవంతుడు 15 రకాల ఆపదలలో చిక్కుకునేట్టు చేస్తాడు: 1.జీవితకాలము తగ్గిపోతుంది.2.జీవనాధారము తగ్గిపోతుంది.3.తన ముఖము నుండి సజ్జనుల యొక్క స్వరూపాన్ని కోల్పోవటం జరుగుతుంది.4.ఇతర సత్కార్యాలకు ఎటువంటి పుణ్యము లభించదు.5. ప్రార్ధనలు స్వీకరింపబడవు.6.ఇతర సజ్జనుల యొక్క ప్రార్ధనలు ఇతనికి ఎటువంటి లాభాన్ని చేకూర్చవు.7.అవమాన భరితమైన మృత్యువును పొందుతాడు.8.ఆకలి మరియు దాహంతో ఈ లోకాన్ని వీడవటం జరుగుతుంది.9.అతని సమాధిలో శిక్షించటానికి ఒక దైవదూత నియమింపబడతాడు.10. సమాధిని ఇరుకుగా చేయటం జరుగుతుంది.11.సమాధి చీకటిగా మారుతుంది.12.అతనిని భూమివైపు లాగటానికి ఒక దైవదూత నియమింపబడతాడు.13.ప్రళయదినాన కఠినంగా లెక్కతీసుకోవటం జరుగుతుంది.14.అల్లాహ్ కృపాదృష్టి  అతని నుండి దూరమవుతుంది.15.కఠినమైన శిక్షను పొందుతాడు.

రెఫరెన్స్: సఫీనతుల్ బిహార్,2వ భాగము,పేజీ నం:44.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13