మీ భార్యాపిల్లలు మీ పాలిట శత్రువులు

శుక్ర, 12/13/2019 - 17:44

మీ భార్యాపిల్లలు మీకు ఎప్పుడు శత్రువులవుతారు? అన్న దానిపై ఇమాం ల వారి హదీసు ద్వారా వివరణ.

భార్యాపిల్లలు,శత్రువులు,ఇమాం బాఖిర్.

దైవవాణిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: ఓ విశ్వాసులారా! మీ భార్యలలో,మీ బిడ్డలలో కొందరు మీకు శత్రువులు.కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి.ఒక వేళ మీరు గనక ఉపేక్షించి,క్షమించి,సడలింపు వైఖరిని అవలంభించినట్లైతే అల్లాహ్ క్షమించేవాడు,దయదలిచే వాడు [అత్ తగాబున్/14]. భార్యలు,పిల్లలు అందరూ మనకు శత్రువులా?ఆ శత్రుత్వం మనం బాహ్య ప్రపంచంలో చూసే పగ,శత్రుత్వం లాంటివేనా? అన్న ప్రశ్నలు కలుగుతాయి.నిజంగా చూస్తే భార్యా పిల్లలు అందరూ అలాంటి వారు కారు.వారిలో కొందరే మనకు శత్రువులు.ఈ ఆయతు యొక్క తాత్పర్యాన్ని వివరిస్తూ ఇమాం బాఖిర్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: దైవప్రవక్త[స.అ.వ] ల వారు మదీనా హిజ్రత్ చేయాలనుకున్నప్పుడు కొంత మంది యొక్క భార్యలు మరియు వారి పిల్లలు వారిని హిజ్రత్ చేయకుండా అడ్డుకుని “ఆ దేవునిపై ప్రమాణము మీరు వలసవెళ్ళవద్దు,ఒక వేళ మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మాకు దిక్కెవరు?” అని చెప్పారు.అప్పుడు అల్లాహ్ తరుపు నుండి ఆయతు వచ్చింది ఇటువంటి మాటలను, వారి సూచనలను వినవద్దని హెచ్చరించటం జరిగింది.కొందరు తమ భార్యాపిల్లల మాటలను లెక్కచేయకుండా హిజ్రత్ చేశారు.అప్పుడు వారు తమ భార్యాపిల్లలతో ఈ విధంగా చెప్పారు: “మీరు ఆ దేవుని కొరకు మాతో పాటు హిజ్రత్ చేయకపోతే రేపటి రోజు మీరు దారుల్ హిజ్రా [మదీనా] వచ్చినప్పుడు మేము మిమ్మల్ని బేఖాతరు చేస్తాము” అని చెప్పారు. కానీ ఆ తరువాత వారిని మీ భార్యాపిల్లల్ని క్షమించి వదిలివేయమని ఆజ్ఞాపించటం జరిగింది.

రెఫరెన్స్: తఫ్సీరె ఖుమ్మీ,2వ భాగము,పేజీ నం:355.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 22