తౌబహ్ యొక్క షరతులు ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

శని, 12/14/2019 - 13:16

తౌబహ్ మరియు పశ్చాత్తాపానికి కొన్ని షరతులు ఉన్నాయి అవి ఏమిటి అని వివరిస్తున్న ఇమామ్ అలీ[అ.స] హదీస్...

తౌబహ్ యొక్క షరతులు ఇమామ్ అలీ[అ.స] దృష్టిలో

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఎవరో ఒక వ్యక్తి హజ్రత్ అలీ[అ.స] ముందు “అస్తగ్ఫిరుల్లాహ్” అని అన్నాడు, దానికి వారు “నీ తల్లి నీపై శోఖించుగాక, నీకు “అస్తగ్ఫార్” అంటే ఏమిటో తెలుసా? అని ప్రశ్నించారు. (అతడు చేసిన అస్తగ్ఫార్ కేవలం నోరు నుంచి వచ్చింది మాత్రమే, అతడికి తౌబహ్ యొక్క యదార్థం తెలియదు) ఇమామ్ అలీ[అ.స] ఇలా ఉపదేశించారు: “....... అస్తగ్ఫార్ లో ఆరు విషయాలు ఉండటం అవసరం:
1. గతంలో చేసిన పాపకార్యానికి పశ్చాత్తాపం మరియు దాని పట్ల బిడియం
2. పాపకార్యాలను వదిలేయాలన్న గట్టి ఆలోచన
3. ప్రజల పట్ల మనిషికి ఉండే బాధ్యతలను, అతడి అంతిమ సమయంలో ఎటువంటి బాధ్యతను మిగిపోకుండా నిర్వర్తించటం మరియు పవిత్రంగా అల్లాహ్ వద్దకు చేరుకోవటం.
4. విధిగా నిర్ధారించబడిన అన్ని కర్తవ్యాలను పూర్తి చేయాలి.
5. ధర్మవిరుద్ధ సంపాదనతో శరీరంలో ఏర్పడిన మాంసాన్ని పరలోకాన్ని దృష్టిలో ఉంచి, దానిని చర్మం ఎముకలతో అంటుకుపోయినట్లుగా కరిగించాలి మరియు శరీరం హలాల్ మాంసంతో నిండి పోవాలి.
6. మీ శరీరాన్ని అల్లాహ్ ప్రార్ధన రుచిని చూపించాలి.
నీలో ఈ ఆరు లక్షణాలు వచ్చిన్పపుడు నీకు “అస్తగ్ఫిరుల్లాహ్”ను జపించే అర్హత కలుగుతుంది”[అల్ కాఫీ, భాగం2, పేజీ431]
అల్లాహ్ మనల్ని నిజమైన తౌబాహ్ చేయువారిలో నిర్ధారించుగాక.

రిఫ్రెన్స్
అల్ కాఫీ, మర్హూమ్ కులైనీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, 1407ఖ.    

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
14 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6