ఈ ప్రాపంచిక జీవితం ఒక కల మాత్రమే.అంతా ఈ ప్రాపంచిక జీవితమేనని భావించేవారు యదార్ధాన్ని తెలుసుకోలేని మూర్ఖులు.
ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: “ఈ ప్రాపంచిక జీవితం ఒక కల దానిపై గర్వపడటం తరువాత పశ్చాత్తాపానికి కారణం అవుతుంది”.ఈ ప్రాపంచిక జీవితం ఒక కల లాంటిది మనిషి ఏదైతే కలలో చూస్తాడో అది యదార్దం మాత్రం కాదు.కలలో చూసే అందమైన దృశ్యాలు మరియు ప్రకృతి దృశ్యాలు కల నుంచి మేల్కొన్న తరువాత ఉండవు.ఆ కలల ప్రపంచంలో మునిగి పోవటం కూడా నిర్లక్ష్యపరుల లక్షణం.యదార్ధంగా చూస్తే ఈ ప్రపంచం నాలుగు రోజులలో అంతమై పోతుంది కానీ ఈ ప్రపంచం తరువాతే నిజమైన ప్రపంచం ఉందని దానిలో మనిషికి మృత్యువనేది లేదని మరియు అక్కడ మానవునికి లభించే సుఖాలు కూడా శాస్వతమైనవని మరియు అది నిజమైన సాఫల్యమని గుర్తుంచుకోవాలి. ఈ ప్రాపంచిక జీవితం ఒక నీడ లాంటిది దానిని శాస్వతమైనదిగా భావించేవాడు మూర్ఖుడు.సముద్రపు తీరాన కూర్చుని ఇసుకతో తన కలల రాజమందిరాన్ని నిర్మించుకునేవాడికి ఈ ఆనందం కేవలం కొంత సమయం వరకే అని చెప్పినా అది వాడికి అర్ధం కాదు. మృత్యువు ఎప్పుడూ మన కోసం నిరీక్షించదు అది నిశ్చితంగా అందరికి రావల్సిందే.ఈ మృత్యువు మానవునిని ఈ కలల ప్రపంచం నుండి మేల్కొలిపినప్పుడు ఇదంతా ఒక కలా?నేను కలల ప్రపంచంలో జీవిస్తూ వచ్చానా? అని తనను తాను ప్రశ్నించుకుంటాడు.
రెఫరెన్స్: హిక్మథాయె అలవి,జవాద్ మొహద్దసి.
వ్యాఖ్యానించండి