అల్లాహ్ పవిత్రగ్రంధం ఖురాన్ ను మహనీయ ప్రవక్త[స.అ] మనస్సును బలపరచడం కొరకు 23 సంవత్సరములు దశలవారీగ అవతరింపజేశాడు.
అనంతకరుణామయుడు అపారక్రుపాసీలుడైన అల్లాహ్ పేరిట
ఖురాన్ గురించి ప్రతీ ముస్లింకు కొన్ని సందేహాలు ఉంటాయి ఖురాన్ ఏ విధంగా అవతరించింది? మరియు దాని అవతరణ విధానం ఏమిటి అని, దాని సరైన జవాబు ఖురాన్ ద్వారానే తెలుసుకుందాం:
ఖురాన్ అవతరణ విధానం: ఖురాన్ అవతరణ గురించి పండితులు రెండు విధాలుగా అవతరించిందని చెబుతారు:
1. పూర్తి ఖురాన్ ఒకేసారి అవతరించింది: ఒక సారిగా అవతరించడం అంటే ఖురాన్ యొక్క వాస్తవమైన తాత్పర్యం ఒక్క సారిగా మహాప్రవక్త[స.అ]పై షబేఖద్ర్ లో అవతరించబడింది అని దాని అర్ధం.
ఖురాన్ అవతరణ గురించి ఖురాన్ లోనే అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ
నిస్చయంగా మేము దీనిని(ఈ ఖురాన్ ను) ఘనమైన రాత్రి యందు అవతరింపజేసాము[అల్-ఖద్ర్/1].
2. దశలవారిగా అవతరించింది: ఈ ఖురాన్ 23 సంవత్సరములు దశలవారీగా మహనీయ ప్రవక్త[స.అ] పై అవతరించబడినది, దాని గురించి ఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَقُرْءَانًۭا فَرَقْنَٰهُ لِتَقْرَأَهُۥ عَلَى ٱلنَّاسِ عَلَىٰ مُكْثٍۢ وَنَزَّلْنَٰهُ تَنزِيلًۭا
నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖుర్‌ఆను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము[అల్-ఇస్రా/106].
అవిశ్వాసులు అల్లాహ్ ఖురాన్ ను ఒక్కసారిగా ఎందుకు అవతరింపజేయలేదు అని ప్రశ్నించినప్పుడు దానికి కారణాన్ని వివరిస్తూ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు:
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْلَا نُزِّلَ عَلَيْهِ ٱلْقُرْءَانُ جُمْلَةًۭ وَٰحِدَةًۭ ۚ كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَ ۖ وَرَتَّلْنَٰهُ تَرْتِيلًۭا
"ఇతనిపై ఖుర్‌ఆన్ సాంతం ఒకేసారి ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అవిశ్వాసులు అంటారు. దీనిద్వారా నీ మనసును దృఢంగా ఉంచడానికి మేము దీనిని ఇలాగే (కొద్ది కొద్దిగా), అంచెలవారీగా పంపాము[అల్-ఫుర్ఖాన్/32].
ఈ దైవసందేశం ఖురాన్ మహప్రవక్త[స.అ] పై ఒక్కసారిగా అవతరించిందో లేదా దశలవారీగా అవతరించిందో కచ్చితంగా చెప్పలేము ఈ అవతరణ విధానం ఆ అల్లాహ్ కు తెలుసు లేదా ఆ ప్రవక్త[స.అ]కు తెలుసు, ఏదైతేనేం ఈ దైవసందేశం ప్రజల హక్కులో ఒక కారుణ్యప్రదాయిని.
వ్యాఖ్యానించండి