నిత్యం ఉండవలసిన పరలోక నివాసాన్ని మరచి ఈ ప్రాపంచిక జీవితం యొక్క సుఖాలలో మునిగి ఉన్నవాడు కేవలం ఒక మూర్ఖుడు.

ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “జ్ఞానికి అనుచితమేమింటంటే తన పరలోక ప్రస్థానానికి ముందుగానే ఏమైనా [పుణ్యకార్యాలను] పంపవలెను తాను ఉండబోతున్న ఇంటిని నివాసయోగ్యంగా మార్చుకోవలెను”.తెలివైనవాడు తన భవిష్యత్తు కార్యాచరణను తప్పకుండా కలిగి ఉంటాడు.పరలోకం గురించి చింతించటం కూడా అందులోని భాగమే.ఈ ప్రాపంచిక జీవితంలో కొద్దిపాటి జీవితాన్ని గడపటానికి అవసరమైన ఒక ఇంటిని నిర్మించుకోవటానికి ఎన్నో విచారగ్రస్థుడై ఉంటాడు అలాంటిది నిత్యం ఉండవలసిన పరలోక నివాసం గురించి అతను చింతనను కలిగి ఉన్నాడా?ఈ ప్రాపంచిక జీవితం గురించి ఆలోచించి నిత్యం ఉండవలసిన పరలొక నివాసం గురించి ఎటువంటి చింతన లేకుండా ఉండటం తగినదా? అల్లాహ్ దైవవాణిలో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “ప్రాపంచిక జీవితం ఆట,తమాష తప్ప మరేమీ కాదు.అయితే భయభక్తులు కల వారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది.ఏమిటీ మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా?” [అన్ ఆం/32]. దివ్యఖురాను మరియు హదీసుల అనుసారంగా ఆ పరలోక నివాసాన్ని కేవలం మతతత్వం,ఆరాధన,దైవభక్తి,పుణ్యకార్యాలు మరియు ప్రజాసేవ ద్వారా నివాసయోగ్యంగా మార్చుకోవచ్చు.
రెఫరెన్స్: గురరుల్ హికం,6వ భాగము,పేజీ నం:442.
వ్యాఖ్యానించండి