విశ్వాసుని గౌరవం దేనిలో ఉంది?

బుధ, 12/18/2019 - 19:13

విశ్వాసుని గౌరవం దేనిలో ఉంది అన్నదానికి ఇమాం[అ.స] ల వారి జవాబు.

విశ్వాసుడు,గౌరవం,ఇమాం ముహమ్మద్ తఖి.

ఇమాం ముహమ్మద్ తఖి[అ.స] ల వారు ఈ సెలవిస్తున్నారు: “విశ్వాసుని యొక్క గౌరవము ప్రజల నుండి దేనిని ఆశించకుండా ఉండటంలోనే ఉంది”.దురాశ అనేది మానవునిని బానిశగా మరియు ఎటువంటి మర్యాద లేని వాడిగా చేస్తుంది.కొందరి కళ్ళు ఎప్పుడూ ఇతరులపై ఉంటాయి వారు ఎల్లాప్పుడూ ఇతరులను దురాశతో చూస్తూ ఉంటారు.ఇది వారి యొక్క అత్యంత హీనమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.కానీ నిజమైన విశ్వాసుడు ఎల్లప్పుడూ గౌరవంగా బ్రతకటానికి శ్రమిస్తూ ఉంటాడు మరియు ఆ గౌరవప్రతిష్టలను కేవలం అల్లాహ్ నుండే ఆశిస్తాడు.ఎప్పుడైతే దురాశను వదిలి ఇతరులతో కలిసి మానవత్వంతో మెలుగుతాడో అప్పుడే అతడు ఒక గౌరవప్రదమైన విశ్వాసిగా జీవించగలడు.కొందరు కేవలం కొద్దిపాటి ధనం లేదా చిన్నపాటి పదవి కోసం తమనుతాము అవమానపరుచుకుంటారు కానీ వేరే వైపు చూస్తే కొందరు కేవలం నిజయితీగా మరియు గౌరవంగా జీవించాలనుకునే వారు అదే సంపదను,అధికారాన్ని వదులుకుని సంతృప్తితో నిండిన జీవితాన్ని గడుపుతారు.నిజమైన విశ్వాసి లక్షణం కూడా ఇదే.

రెఫరెన్స్: ఆలాముద్దీన్,పేజీ నం:309.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14