హజ్రత్ అబూబక్ర్ తాను చేసిన మూడు పనుల గురించి అవి చేయకుండా ఉంటే బాగుండేది అని వ్యక్తం చేశారు అని చరిత్రలో ఉంది
హజ్రత్ అబూబక్ర్ తన అంతిమ సమయంలో ఇలా అన్నారు, ఔను! అల్లాహ్ సాక్షిగా నేను చేసిన మూడు పనుల పై చింతిస్తున్నాను, నేను ఆ పనులు చేయకుండా ఉంటే బాగుండేది:
1. అలీ[అ.స] ఇంటిని ఉన్న పరిస్థితిలోనే వదిలేసి ఉంటే భాగుండేది(దాడి చేయకుండా ఉండాల్సింది). మరో రివాయత్ లో “ఫాతెమా[స.అ] ఇంటిని తెరవకుండా ఉంటే బాగుండేది(దాడి చేయకుండా ఉండాల్సింది)”, వారు నాకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగివచ్చినా సరే (నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది).
2. సఖీఫహ్ రోజున నేను అబూ ఉబైదహ్ లేక ఉమర్లలో ఎవరో ఒకరి చేయి ఎత్తి, వారిలో ఒకరిని ఖలీఫాగా నియమించి నేను తప్పుకుంటే ఎంతబాగుండేది.
3. జుల్ ఫజాహ్ సలమీను బంధించి తీసుకొచ్చినప్పుడు, నేను అతడికి చంపి ఉండాల్సింది లేదా విడిచి పెట్టాల్సింది కాని నేను అతడిని అగ్గిలో కాల్చకుండా ఉండాల్సింది.
రిఫ్రెన్స్
అఖ్దుల్ ఫరీద్, భాగం4, పేజీ268/ తారీఖె తబరీ, భాగం3, పేజీ430, మురవ్విజుజ్ జహబ్, భాగం2, పేజీ303/ అబూ ఉబైద్ వ కితాబుల్ అమ్వాల్(అబూ ఉబైద్)/ అల్ మొఅజముల్ కబీర్(తబరానీ)/ కితాబు కామిల్(ముబర్రద్)/ ముఖ్తసర్ తారీఖు దమిష్ఖ్(మొహమ్మద్ ఇబ్నె ముకర్రమ్)/ తారీఖుల్ ఇస్లామ్(జహబీ)/ ముజ్ముఅజ్జవాయిద్(హైసమీ)/ లిసానుల్ మీజాన్(అస్ఖలానీ)/ కన్జుల్ ఉమ్మాల్(ముత్తఖీయె హిందీ)
వ్యాఖ్యానించండి