దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉదారస్వభావం

శుక్ర, 12/20/2019 - 18:18

దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉదారస్వభావాన్ని తెలిపే ఒక సంఘటన.

దైవప్రవక్త,ఉదారస్వభావం,ఆదరించటం.

ఒక రోజు దైవప్రవక్త[స.అ.వ] ల వారు వారి ఇళ్ళలో నుండి ఒక ఇంటిలోకి విచ్చేసారు ఆ ఇల్లు వారి అనుచరులు ఎక్కువగా ఉండటం వలన నిండిపోయింది.అదే సమయంలో జరీర్ బిన్ అబుల్లాహ్ ఇంట్లోకి ప్రవేశించటం జరిగింది.కూర్చోవటానికి చొటు లేక ఇంటి తలుపుల వద్దే కూర్చున్నారు.దైవప్రవక్త[స.అ.వ] ల వార్ తన అబాను [వస్త్రాన్ని]  అతనికి ఇచ్చి “ఈ అబాను క్రింద పరుచుకుని కూర్చో” అని అన్నారు.అప్పుడు జరీర్ ఆ అబాను తీసుకుని దానిని తన ముఖము మీద ఉంచి ముద్దాడి ఎడవటం మొదలుపెట్టాడు.తరువాత దానిని మడచి దైవప్రవక్త[స.అ.వ] ల వారికి ఇస్తూ “నేను ఎప్పటికీ మీరిచ్చిన వస్త్రంపై కూర్చోను మీరు నన్ను ఏ విధంగా అయితే ఈ వస్త్రాన్ని ఇచ్చి ఆదరించారో ఆ అల్లాహ్ కూడా మిమ్మల్ని ఆదరించుగాక” అని అన్నాడు.దైవప్రవక్త[స.అ.వ] ల వారు అటూ ఇటూ చూసి “ఎప్పుడైనా ఒక గౌరవప్రదమైన వ్యక్తి నీ వద్దకు వచ్చినప్పుడు అతనిని ఆదరించు అదేవిధంగా ఎవరికైతే ముందునుండి నీ మీద హక్కు ఉన్నదో వారిని కూడా గౌరవించు” అని అన్నారు.

రెఫరెన్స్: ఎక్ సదొ బీస్త్ దర్సె జిందగీ అజ్ సీరయే ముహమ్మద్[స.అ.వ],పేజీ నం:14.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9