.మానవుడు అనే రాజ్యానికి రాజు ఆత్మ, ఆ ఆత్మకు నలుగురు మంత్రులు; 1. బుద్ధి, 2. కోపం, 3. ఆశ, 4. భ్రమ.
మనిషి ఈ విశ్వానికి ప్రతిరూపం. అతడిలో ఒక ప్రపంచం దాగివుంది, అతడిలో ఒక రాజ్యపరిపాలన జరుగుతుంది. ఆ రాజ్యానికి రాజు ఆత్మ, ఆ ఆత్మకు నలుగురు మంత్రులు; బుద్ధి, కోపం, ఆశ, భ్రమ. ఈ నాలుగు మంత్రులలో బుద్ధి అనే మంత్రి ఆ మిగిలిన మూడు మంత్రులను వశపరుచుకుంటే మనిషి, మంచివాడిగా మారతాడు అదే ఒకవేళ ఆ ముగ్గురు మంత్రులు నుండి ఏ ఒక్క మంత్రి అయినసరే బుద్ధిని వశపరుచుకంటే ఆ మనిషి చెడ్డవాడిగా మారతాడు.
ఇస్లామీయ బోధనల ప్రకారం ప్రాణులు మూడు రకాలు; దైవదూతలు, మనుషులు మరియు జంతువులు. అల్లాహ్ దూతలకు కేవలం బుద్ధిని, జంతువులకు మిగతా మూడు వాటిని ప్రసాదించాడు. కానీ మనిషికి బుద్ధితో పాటు మరో మూడు శక్తులను ప్రసాదించాడు. బుద్ధి మరియు మిగిలిన మూడు శక్తుల మధ్య నిరంతరం యుద్ధం సాగుతూ ఉంటుంది. బుద్ధి ఆ మిగిలిన ఈ మూడు శక్తులను ఓడిస్తే మనిషి దైవదూతల కన్నా ప్రతిష్టుడవుతాడు, ఎందుకంటే దైవదూతలలో ఉన్న బుద్ది మిగిలిన వాటి పై యుద్ధం చేసి వాటిని ఓడించినందుకు ప్రతిష్టులవ్వలేదు కాబట్టి. వారి సృష్టియే పవిత్రత పై నిలబడి ఉంది. కానీ అదే ఒకవేళ ఆ మూడు శక్తుల నుండి ఏ ఒక్క శక్తి కూడా బుద్ధుని ఓడించినట్లైతే ఆ మనిషి జంతువు కన్నా హీనం గా మారతాడు, ఎందుకంటే జంతువులకు బుద్ధి లేదు కాబట్టి.
ఇక ఇప్పుడు మనిషి; అతడు దైవదూతల పై ప్రతిష్టులవ్వాల లేక జంతువుల కన్నా హీనులవ్వాల అనేది అతడి చేతుల్లోనే ఉంది.
వ్యాఖ్యానించండి