నిజమైన పిచ్చివాడు

ఆది, 12/29/2019 - 16:22

నిజమైన పిచ్చివాడు ఎవరూ అన్న విషయం పై దైవప్రవక్త[స.అ] హదీస్ వివరణ...

నిజమైన పిచ్చివాడు

ఒకరోజు దైవప్రవక్త[స.అ] ఒక ప్రదేశం నుండి వెళ్తుండగా ఒక వ్యక్తి చూట్టు గుంపుగా నిలబడి ఉన్నారు, వారి దగ్గరకు వెళ్ళి “ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నారు?” అని ప్రశ్నించారు. “ఇక్కడ ఒక పిచ్చివాడు ఉన్నాడు”(అతడి పిచ్చి చేష్టలు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయి) అని వారన్నారు. వారితో దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు:  “నిజమైన పిచ్చివాడు ఈ వ్యక్తి కాదు; ఇతడిని చూసుకోవడానికి ఎవరూ లేరు అంతే(ఇతడు ఒక రోగి). మీకు నిజమైన పిచ్చోడి గుర్తులు ఏమిటో తెలియపరచనా?” “ఔను తెలియపరచండి” అని అన్నారు. దైవప్రవక్త[స.అ] ఇలా ఉపదేశించారు:
1. గర్వం మరియు అహంకారంతో నడిచేవాడు(తనే గొప్పగా భావించేవాడు, అహంకారి)
2. తన ఇరువైపులు మాటిమాటికి చూసుకునేవాడు(తనను తానే చూసుకొని మురిసిపోయేవాడు-ఇదీ ఒక రకమైన అహంకారమే)
3. తన భూజాలను పైకీ క్రిందకి ఎత్తిదించుతూ ఉండేవాడు(తననే చూడాలని భావించేవాడు, ఇతరులను తక్కువచేసి చూసేవాడు-ఇదీ ఒక రకమైన అహంకారమే)
4. అల్లాహ్ నుండి స్వర్గాన్ని వేడుకుంటాడు కాని తన పాపకార్యములను మాత్రం వదలనివాడు
5. అతడి చెడు నుండి సమాజం సురక్షితంగా ఉండదు మరియు అతడి నుండి సమాజానికి ఎటువంటి మంచిని ఆశించలేము.[అల్ ఖిసాల్, భాగం1, పేజీ332]

రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఖిసాల్, కితాబ్ చీ, తెహ్రాన్-ఇరాన్, 1377ష.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13