.మనిషి మరణంతో అతని దేశం నశించిపోతుంది కాని అతని ఆత్మ యొక్క ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది.
మనిషి, శరీరం మరియు ఆత్మతో కూడి ఉన్న ఒక ప్రాణి. మనిషి మరణంతో అతని దేశం నశించిపోతుంది కాని అతని ఆత్మ యొక్క ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది. మరణం మనిషి యొక్క నాశనానికి నిదర్శనం కాదు. ఆత్మ ప్రళయం వరకు బర్జఖ్(ఒకరి మరణానికీ ప్రళయానికీ మధ్యనున్న సమయం)లో జివనాన్ని సాగిస్తుంది. అల్లాహ్ మనిషి సృష్టి యొక్క దశలను వివరిస్తూ చివరి దశలో దేహంలో ఆత్మ ద్వార ప్రాణాన్ని పోశాము అని సూచించాడు. ఖుర్ఆన్ ఇలా ప్రవచించెను: ثُمَّ أَنشَأْنَاهُ خَلْقًا آخَرَ అనువాదం: ఆ తరువాత దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము.[మొమినూన్, ఆయత్.. 14]
ఆత్మకు కురుకు గాని నిద్ర గాని రావు. మేము నిద్రపోయినా మన ఆత్మ మెలకువగా ఉంటుంది. శరీరం ఆత్మ యొక్క కారాగారం అందుకనే మనం నిద్రలో ఈ శరీరం వెళ్ళలేని చోట్లకు కూడా ఆత్మ వెళ్ళి వస్తూ ఉంటుంది. మన ఆత్మ స్ర్తీ కాదు పురుషుడూ కాదు, ఇవి శరీరానికి సంబంధించినవి మాత్రమే. ఆత్మకు చావు లేదు. మరణించేది మన శరీరం మాత్రమే. గుర్తుంచుకోండి ఈ శరీరంలో మనం ఉన్నము అంతే, మన అసలు రూపం మన ఆత్మ మాత్రమే. మన శరీరం బాగుండాలని ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే మన ఆత్మ బాగుండాలంటే కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 60, 70 సంవత్సరాలు మనతో ఉండే శరీరం కోసమే ఎన్ని జగ్రత్తలు తీసుకుంటాం అలాంటిది కలకాలం ఉండే నేను(ఆత్మ) విషయంలో మరెంత జాగ్రత్తలు తీసుకోవాలి!.
ఆలోచించండి!
వ్యాఖ్యానించండి