బుధ, 01/01/2020 - 18:27
మద్యపానం మత్తు కాకుండా మరో ఐదు మత్తుల ప్రస్తావనం హదీస్ లో...
ఇమామ్ అలీ[అ.స] ఉల్లేఖనం: బుద్ధిమంతుడు ఈ ఐదు వాటికి దూరంగా ఉండటం మంచిది:
1. ధనం మత్తు
2. బలం మత్తు
3. జ్ఞానం మత్తు
4. పొగడ్తల మత్తు
5. యవ్వనం మత్తు
వీటన్నీంటి నుండి చెడు గాలి వీస్తుంది, ఆ గాలి బుద్ధిని వశపరుచుకుంటుంది, మనిషి యొక్క ప్రతిష్టతను తక్కువ చేస్తుంది, మద్యం సేవించిన మనిషికి మంచిచెడ్డలు తెలియనట్లు. త్రాగుబోతుకు మత్తు దిగనంత వరకు ఏమి చేస్తున్నాడో అతకే తెలియదు[గురరుల్ హికమ్, పేజీ66] అదే విధంగా ధనం, బలం, జ్ఞానం, పొగడ్త మరియు యవ్వనం మత్తు దిగనంత వరకు మనిషి బుద్ధి కూడా త్రాగుబోతు వలే పని చేయదు.
రిఫ్రెన్స్
అబ్దుల్ వాహిద్ ఇబ్నె ముహమ్మద్, ఆమదీ, గురరుల్ హికమ్, దఫ్తరె నష్రె ఫర్హంగె ఇస్లామీ, తెహ్రాన్-ఇరాన్, 1378ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి