.మంచితనం, మానవత్వం, జాలీ, దయ మరియు కరుణా మొ॥, ఇవన్నీ స్థిరమైనవి; మారుతున్న కాలం మరియు సామాజిక మార్పులు వాటిని మార్చలేవు.
సృష్టించబడే ప్రతి మనిషి, పవిత్రత మరియు ఏకేశ్వరవాద స్వభావంపై సృష్టించబడతాడు. ఒకవేళ అదే స్వభావంతో ముందుకు సాగితే బాహ్య కారణాలు అతనిని రుజుమార్గం నుండి తప్పించలేవు మరియు అతను సత్యమార్గం పైనే నడుస్తాడు. ఎవ్వరూ తమ తల్లి కడుపు నుండి పాపిగా, దుర్మార్గుడిగా మరియు దుష్ణుడిగా జన్మించడు. ఈ పాపం, దుర్మార్గం మరియు దుష్టత్వం అన్నీ బయటనుండి మనిషి పై ప్రభావితమవుతాయి. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “కనుక నీవు ఏకాగ్రతతో మీ ముఖాన్ని అల్లాహ్ ధర్మంపై నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావం పైనే ఉండండి”.[రూమ్ ఆయత్:30].
దైవప్రవక్త[స.అ] కూడా ఇలా ప్రవచించారు: “من مولود الا یولد علی الفطره అనువాదం: పుట్టే ప్రతి వాడు పవిత్ర స్వభావంతో పుడతాడు”. మంచి గుణాలు వాస్తవానికి మానవత్వ సూత్రాలు, అవి స్వభావంపై నిలిచి ఉంటాయి. ఈ సూత్రాలు స్థిరమైనవి. మారుతున్న కాలం మరియు సామాజిక మార్పులు వాటిని మార్చలేవు. ఉదాహరణకు మంచితనం, మానవత్వం, జాలీ, దయ మరియు కరుణా మొ॥, ఇవన్నీ స్థిరమైనవి. మానవులు ఉన్నంతకాలం ఇవి కూడా ఉంటాయి. ఒకవేళ మనిషి ఈ పవిత్ర స్వభావాన్ని నాశనం చేసుకుంటే అతడికి మంచితనం, మానవత్వం, జాలీ, దయా లాంటివి అర్ధం కావు. ఈనాడు మీరు ప్రపంచాన్ని చూసినట్లైతే, ఎవరు పవిత్ర స్వభావం కలిగి ఉన్నారో మరియు ఎవరు ఆ స్వభావాన్ని నాశనం చేసుకొని జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుస్తుంది.
వ్యాఖ్యానించండి