అల్లాహ్ పట్ల కృతజ్ఞతా లేక కృతఘ్నతా!

శని, 12/16/2017 - 17:31

.మనకు సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని మన బుద్ధి మనకు ఆదేశిస్తుంది.

అల్లాహ్ పట్ల కృతజ్ఞతా లేక కృతఘ్నతా!

మనిషి స్వతంత్రం, స్వేచ్ఛ కలిగి ఉన్నవాడు; అనగ అతడు, అతడికి ప్రసాధించబడిన బుద్ధీ మరియు వివేక శక్తి ద్వారా ఒక పనిని పరిశీలించి, పరీక్షించి దానిని ఎన్నుకోవాలా వద్దా, దానిపై అమలు చేయాలా లేదా వదిలేయాలా అని తెలుసుకోగలడు.  అల్లాహ్ తన పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “إِنَّا هَدَیْنَاهُ السَّبِیلَ إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا మేము అతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించిన లేక కృతఘ్నుడుగా తయారైనా(వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్ఛను హరించలేదు)”[సూరయే దహ్ర్:3].
ఎవరైనా ఒక సహాయం చేసినా లేదా ఎదైనా మనకు ఇచ్చినా మేము వారికి రుణపడి ఉంటాం. మరియు ఒకవేళ ఎదుటివాడి సహాయం చాలా పెద్దది అయి ఉంటే మేము “జీవితాంతం మీకు రుణపడి ఉంటాను” అని అంటూ ఉంటాము. అంటే మనకు ఇలా చేయాలని ఎవరు ఆదేశిస్తున్నారు! మన బుద్ధియే మనకు సహాయం చేసినవారికి కృతజ్ఞత తెలుపుకోవాలి, అని చెబుతుంది. ఇక మీరే ఆలోచించండి అల్లాహ్ మనకు ఏ ఏ అనుగ్రహాలను ప్రసాదించాడో. మనకు ఎలాంటి సమయాలలో సహాయపడ్డాడో. ఒక్క క్షణం అల్లాహ్ కరుణ లేకుండా మనిషి జీవించలేడు. మేము ప్రాణంతో ఉన్నాము అంటే దాని అర్ధం అల్లాహ్ కరుణ మనపై నిరంతరం కురుస్తూనే ఉంది అని. ఇప్పుడు మీరే తీర్మానించాలి అల్లాహ్ పట్ల కృతజ్ఞత తెలుపుకోవాలా లేదా కృతఘ్నత వహించాలా, అని.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9