ఖిలాఫత్ ను ఒక చొక్కాగా ఉపమానించి, దానిపై హక్కులేకున్నా సరే ఎవరు ఖిలాఫత్ ను లాక్కున్నారో వివరించిన ఇమామ్ హదీస్...

ఇమామ్ అలీ[అ.స] అబూబక్ర్ తో చేయబడిన బైఅత్ గురించి ఇలా అన్నారు: “అల్లాహ్ ప్రమాణంగా ఇబ్నె అబీ ఖహాఫా, ఖిలాఫత్ చొక్కాని లాక్కోని సరిచేసుకోని ధరించాడు. అతనికి తెలుసు ఆ ఖిలాఫత్‌లో నా స్థానం తిరగలి మధ్యలో ఉండే మేకులాంటి కేంద్ర స్థానమని. జ్ఞాన సముద్రం నా నుండే పోంగి ప్రవహిస్తుంది. ఎవ్వరూ నా ఆలోచనల ఎత్తును అందుకోలేరు”.[సుమ్మహ్తదైతు, పేజీ250]
ఇమామ్ అలీ[అ.స] యొక్క ఈ హదీస్ ద్వార తెలిసే విషయమేమిటంటే ఇమామ్ అలీ[అ.స] అబూబక్ర్ ఖిలాఫత్ ను అంగీకరించలేదు, అంటే వారు అబూబక్ర్ ఖిలాఫత్ ఇజ్మాలో లేరు, ఇమామ్ అలీ[అ.స] లాంటి వారు ఆ ఇజ్మాలో లేరు అంటే అది ఇజ్మాయే కాదు ఎందుకంటే ఇజ్మా అంటేనే అందరు ఒక విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి.
రిఫ్రెన్స్
సమావీ తీజానీ, సుమ్మహ్తదైతు, మొఅస్ససతుల్ ఫజ్ర్, లండన్, 1991మీ.
వ్యాఖ్యానించండి