మానవునిపై నిర్లక్ష్యం యొక్క ప్రభావం

ఆది, 02/09/2020 - 19:26

మానవునిపై నిర్లక్ష్యం వలన కలిగే ప్రభావాల గురించి ఇమాం అలి[అ.స] ల వారి ఉల్లేఖనం.

నిర్లక్ష్యం,ఇమాం అలి,ప్రభావం.

మానవునిపై నిర్లక్ష్యం యొక్క ప్రభావాన్ని వివరిస్తూ ఇమాం అలి[అ.స] ల వారు నెహ్జుల్ బలాఘా లో ఈ విధంగా సెలవిస్తున్నారు:

“మృత్యువు యొక్క స్మరణం మీ హృదయాల నుండి వెళ్ళిపోయింది.మోసపూరిత వాంచలు ఆ స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాయి.ఈ లోకం[వారికి] పరలోకం కంటే గొప్పగా మారింది,మరియు ఈ లోకం పరలోకాన్ని మరిచిపోయేలా చేసింది. నిశ్చయంగా మీరు ధర్మ రీత్యా ఒకరికొకరు సోదరులు.ఏ వస్తువు మిమ్మల్ని వేరుచేయలేదు,మీ మనసులలో [ఒకరికొకరు పెంచుకున్న] అపవిత్ర మరియు అశుధ్ధమైన చెడు ఆలోచనలు తప్ప. ఒకరికొకరు సహాయపడరు మరియు ఒకరి మంచిని వేరొకరు కోరుకోరు.ఒకరికొకరు [ఏదైన వస్తువును] ఇచ్చిపుచ్చుకోవటం కూడా చేయరు,ఒకరినొకరు ఇష్టపడరు కూడా,మీరు సంపాదించిన కొద్దిపాటి [ప్రాపంచిక సంపాదనలో] మీకు సంతృప్తిని కలిగించేదేమిటి?ఎక్కువ మాత్రంలో పోయే పరలోక సంపద పట్ల మీరు దుఖ్ఖించరా?కొద్దిపాటి ఈ లోకసంపదను కోల్పోవటం మీ యొక్క మనశ్శాంతిని పోయేలా చేస్తుంది.అయితే ఆ అశాంతి మీ ముఖాలలో స్పష్టంగా కనబడుతుంది మరియు వారు సాధించని దానిపై అసహనంగా ఉండటం కూడా. ఎలాగంటే ఈ ప్రాపంచిక జీవితం మీ యొక్క శాస్వత నిలమైనట్లుగా మరియు దాని ద్వారా వచ్చే లాభము శాస్వతమైనట్లుగా”.

రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,13వ ఉపన్యాసం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13