ఇతరుల ముందు చెయ్యి చాచకండి.

మంగళ, 02/11/2020 - 12:13

ఎన్ని కష్టాలున్న ఇతరుల ముందు చెయ్యి చాచకుండా వాటిని ఆ అల్లాహ్ తో నే విన్నవించుకోమని దివ్యఖురాను మరియు హదీసులు తాకీదు చేస్తున్నాయి. 

చెయ్యి చాచటం,గౌరవం,సహాయం.

అల్లాహ్ చాలా వివేకవంతుడు మరియు విశ్వాసుల మానాన్ని కాపాడే వాడు కూడా అల్లాహ్యే.తమకు ఎన్ని కష్టాలున్నా వాటిని కేవలం అల్లాహ్ కే విన్నవించుకుని,అవసరం ఉన్నా కూడా ఇతరుల ముందు కేవలం తమ మానం కోసం చెయ్యి చాచి అడగకుండా గౌరవంగా బ్రతకాలనుకునే అల్లాహ్ దాసులను దివ్యఖురాను ప్రశంసిస్తుంది.దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “దైవమార్గములో నిమగ్నులైన్ కారణంగా,[బ్రతుకు తెరువు కోసం] భూమిలో సంచరించే వీలులేని నిరుపేదలు వాస్తవానికి మీ ధన సహాయానికి అర్హులు.వారి నిజస్థితిని గురించి తెలియని వారు,[ఆత్మాభిమానం వల్ల] వారెవరినీ అడగకపోవటం చూసి వాస్తవ స్థితిని చూసి వారిని అవసరాలు లేని వారిగా తలపోస్తారు.మీరు వారి వాలకాన్ని చూసి వాస్థవ స్థితిని ఊహించవచ్చు.తమకు సహాయం చేయమంటు వారు ప్రజల వెంటపడరు.[అటువంటి త్యాగధనుల సహాయార్ధం] మీరు ఎంత సొమ్ము వెచ్చించినా,నిశ్చయంగా దాని గురించి అల్లాహ్ కు తెలుసు” [అల్ బఖర/273]. ఒక హదీసులో ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “మీ మానం[ప్రతిష్టత] తన చోట సమ్రక్షింపబడి ఉంది,కానీ ఇతరుల ముందు చెయ్యి చాచటం వలన అది ఒక్కోక్క చుక్క చొప్పున కరిగిపోతుంది.కాబట్టీ మీరు ఎవరి ముందు చెయ్యిని చాస్తున్నారో ఆలోచించండి”. వేరొక చోట ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు: “మా షీయాలు[అనుచరులు] ఇతరుల ముందు చేతులను చాచరు,[వారు] ఆకలితో మరణించినా సరే ”.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,96వ భాగము,పేజీ నం:158,నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:338.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10