ముహాజెరీనులు మరియు అన్సారులు హజ్రత్ అలీ[అ.స] బైఅత్ చేయడానికి ఆసక్తిగా ముందుకొచ్చారు. ఎవరైతే బైఅత్ చేయకూడదనుకున్నారో వాళ్ళను బలవంతం పెట్టలేదు. కాని హజ్రత్ అబూబక్ర్

ముహాజెరీనులు మరియు అన్సారులు హజ్రత్ అలీ[అ.స] బైఅత్ చేయడానికి ఆసక్తిగా ముందుకొచ్చారు. ఎవరైతే బైఅత్ చేయకూడదనుకున్నారో వాళ్ళను బలవంతం పెట్టలేదు. కాని అబూబక్ర్ బైఅత్ విషయం దీనికి పూర్తి విరుధ్ధంగా జరిగింది. ఉమర్ ప్రస్తావన ప్రకారం; అదోక అకస్మాత్తుగా జరిగిన సంఘటన, దాని అనర్ధాల నుండి అల్లాహ్‌యే కాపాడాడు. ఇక ఉమర్ యొక్క ఖిలాఫత్ పదవి కూడా అబూబక్ర్ ని ఖలీఫాగా కేటాయించినప్పుడే నిశ్చయించబడింది. ఉస్మాన్ ఖిలాఫత్ పదవి అయితే కేవలం అదొక చరిత్ర సంఘటనలలో ఎగతాళి. అందులో ఉమర్ ఆరుగురిని అభ్యర్ధులు చేసి వాళ్ళలో నుండి నలుగురి అభీప్రాయం ఒకటైతే మిగిలిన వాళ్ళు చంపేయబడతారనీ, మరియు ఒకవేళ ఇటు ముగ్గురి అటు ముగ్గురి అభీప్రాయాలు ఒకటే అయితే ఎవరి తరపున “అబ్దుర్రహ్మాన్ ఇబ్నె ఔఫ్” ఉంటారో అతనిని ఖలీఫాగా ఎన్నుకోబడడం జరుగుతుంది. ఒక వేళ చెప్పిన సమయంలోపే తీర్మానించకపోతే అందరిని చంపేయ్యాలి, అని నిశ్చయించారు.
రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అలీ(అ.స)యే అనుచరణకు అర్హులు అధ్యాయంలో.
వ్యాఖ్యానించండి