"అలీయున్ మిన్నీ వ అనా మిన్ అలీ" హదీస్ వివరణ సంక్షిప్తంగా...
హదీస్: “عَلِيٌ مِنِّي وَ أَنَا مِنْ عَلِيٍ وَ لَا يُؤَدِّي عَنِّي إِلَّا أَنَا أَوْ عَلِي” ( అలీయున్ మిన్ని వ అనా మిన్ అలీ వలా యుఅద్దీ అన్నీ ఇల్లా అనా ఔ అలీ)[సుననే ఇబ్నె మాజా, భాగం 1, పేజీ 24].
ఈ హదీసు కూడా దైవప్రవక్త[స.అ] తన సందేశాన్ని ప్రజల వరకు చేర్చేందుకు ఎన్నుకున్న ఆ ఓకానొక వ్యక్తి అలీ ఇబ్నె అబీతాలిబే[అ.స] అని స్పష్టంగా ప్రకటిస్తుంది. ఈ మాట “బరాఅత్” సూరహ్ ప్రచారం కోసం హజ్రత్ అబూబక్ర్‌ను తొలగించి హజ్రత్ అలీ[అ.స]ను పంపినప్పుడు చెప్పారు. తిరిగి వచ్చి అబూబక్ర్ నా గురించి అల్లాహ్ తరపు నుండి ఏదైన విషయం అవతరింపబడిందా? అని దర్యాప్తు చేయగా దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: “అల్లాహ్, ఈ సందేశ ప్రచారాన్ని నేను చేయాలి లేదా అలీ[అ.స] అని ఆదేశించాడు”.
రిఫరెన్స్
సుననే ఇబ్నె మాజా, భాగం 1, పేజీ 24. ఖసాయిసే నిసాయీ, పేజీ 20. తిర్మిజీ, భాగం 5, పేజీ 300
వ్యాఖ్యానించండి