మూర్ఖుడు మౌనంగా ఉంటే అతనికి అతను ఉంటున్న సమాజానికి సైతం మంచిది.
ఇమాం జవాద్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: మూర్ఖుడు మౌనంగా ఉంటే ప్రజల మధ్య విబేధాలుండవు.
విబేధాలనేవి కొన్ని సార్లు అజ్ఞానం వలన మరికొన్ని సార్లు పక్షపాత వ్యాఖ్యలు చేయటం వలన కలుగుతాయి.ప్రతీ వారు తమ జ్ఞాన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడి మరియు తమకు తెలియని వాటికి కాముగా ఉంటే విబేధాలనేవి అంతమైపోవటం ఖాయం.అందరూ కాముగా ఉంటే మంచిది కానీ మూర్ఖుడు కాముగా ఉంటే అంతకన్నా మంచిది.మాట్లాడటం వెండి అయితే కాముగా ఉండటం బంగారమని కొందరు అంటారు.నా మౌనానికి నేను ఎప్పుడూ చింతించలేదు కానీ నేను ఎప్పుడైతే నోటిని విప్పి మాట్లాడానో దాని కోసం చింతించానని ఒక మహాపురుషుడు చెప్పటం జరిగింది. అందుకే ఇమాం అలి[అ.స] ల వారు ఒక హదీసులో ఎప్పుడైతే బుధ్ధి సంపూర్ణ దశకు చేరుకుంటుందో మాటలు తగ్గిపోతాయి అని సెలవిస్తున్నారు. ఒక వేళ నోటిని,కళ్ళను,చెవులను అదుపులో పెట్టుకోకపోతే అవి పాపాలకు సాధనాలుగా మారిపోతాయి.అవి ఒక ఇంటినే కాదు ఒక సమాజాన్ని సైతం నాశనం చేయగలవు. అందువలనే నోటిని సాధ్యమైనంతవరకు అదుపులో ఉంచుకుంటే మంచిది.
రెఫరెన్స్: హిక్మత్ హాయె తఖవి,జవాద్ ముహద్దిసి,బిహారుల్ అన్వార్,71వ భాగం,పేజీ నం:9.
వ్యాఖ్యానించండి