దైవప్రవక్త[స.అ] అలీ[అ.స]ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: ఇతను నా సోదరుడు, నా ఉత్తరాధికారి మరియు నా తరువాత నా ఖలీఫా...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
హదీస్: దైవప్రవక్త[స.అ] అలీ[అ.స]ను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు: “اِن هَذَا أَخِي وَ وَصِيِّي وَ خَلِيفَتِي، فَاسْمَعُوا لَهُ وَ أَطِيعُوا” (ఇన్న హాజా అఖీ వ వసీయ్యీ వ ఖలీఫతీ ఫస్మవూ లహు వ అతీవూన్).
“జుల్ అషీరహ్” విందు భోజనం రోజు దైవప్రవక్త[స.అ], హజ్రత్ అలీ[అ.స] వైపు చూపించి ఇలా అన్నారు: “ఇతను నా సోదరుడు, నా ఉత్తరాధికారి మరియు నా తరువాత నా ఖలీఫా అందుకని అతని మాట వినండి మరియు అతని ఆజ్ఞను పాటించండి”.[తబరీ, భాగం2, పేజీ 319]
ఈ హదీస్, బేసత్ యొక్క మొదట్లో జరిగిన సంఘటనలలో చరిత్ర కారులందరు లిఖించిన సరైన హదీసులలో ఒక హదీసు. మరి దీనిని దైవప్రవక్త[స.అ] మహిమలలో పరిగణించారు.
రఫరెన్స్
తబరీ, భాగం2, పేజీ 319; ఇబ్నె అసీర్, భాగం 3, పేజీ 62; అస్సీరతుల్ హలబియ్యాహ్, భాగం1, పేజీ 311; షవాహిద్దుత్తన్జీలె హస్కాని, భాగం 1, పేజీ 371; కన్జుల్ ఉమ్మాల్, భాగం 1, పేజీ 15; తారీఖె ఇబ్నె అసాకిర్, భాగం 1, పేజీ 85; తఫ్సీరె ఖాజిన్ అలావుద్దీన్ షాఫెయీ, భాగం 3, పేజీ 371.
వ్యాఖ్యానించండి