ఇస్లాం ధర్మంలో దానధర్మాలు కేవలం దైవప్రసన్నత కోసమే చేయాలి. దాని ప్రతిఫలాన్ని ఆయన నుండే ఆశించాలి. ఒకవేళ ఈ దానధర్మాలు ఎవరికైనా చూపించటానికి మరియు పేరుప్రతిష్టల కొరకు చేసినట్లైతే అది వృధా అయినట్లే.
అనంతకరుణామయుడు అపారక్రుపాసీలుడైన అల్లాహ్ పేరిట
మీరు సంపాదించిన సొమ్ములో పేదవారికి కొంత సొమ్ము దానధర్మాల రూపంలో ఇవ్వాలని ఖురాన్ మరియు హదీసులలో చాల చోట్ల ఆజ్ఞాపించడం జరిగింది,ఇస్లాం ఈ దాన ధర్మాల ద్వారానే ధనికులు మరియు పేదలు అనే భేదన్ని చెరిపివేస్తుంది,మరియు పేదలు మరియు దారిద్రుల జీవనస్తాయిని మరియు వారు వారి జీవనవిధానాన్ని మెరుగుపరుచుకొని ఇతరులతో సమానంగా జీవించాలనేదే ఇస్లాం ఉద్దేశం.
దైవ మార్గంలో ఖర్చుపెట్టే వారి ఉపమానం:
وَمَثَلُ ٱلَّذِينَ يُنفِقُونَ أَمْوَٰلَهُمُ ٱبْتِغَآءَ مَرْضَاتِ ٱللَّهِ وَتَثْبِيتًۭا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍۭ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌۭ فَـَٔاتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌۭ فَطَلٌّۭ ۗ وَٱللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఇక దైవప్రసన్నతను చూరగొనే తపనతో, దృఢనమ్మకంతో తమ సంపదను ఖర్చుపెట్టేవారి ఉపమానం మెరక ప్రాంతంలో ఉన్న తోట వంటిది. భారీ వర్షం కురిస్ అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ దానిపై పెద్ద వర్షం పడకుండా, కేవలం వానజల్లు కురిసినా సరిపోతుంది. అల్లాహ్ మీ పనులన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.[అల్-బఖర/265]
దానధర్మాలు చేసి దాని ప్రతిఫలం గురించి ఆశించకూడదు: అల్లాహ్ దైవగ్రంధంలో ఈ విధంగా సెలవిస్తున్నడు:
الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ ثُمَّ لَا يُتْبِعُونَ مَا أَنفَقُوا مَنًّا وَلَا أَذًى ۙ لَّهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
“ఎవరయితే దైవమార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసిన తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ ఉండ కుండా, (గ్రహీతల మనస్సును) నొప్పించకుండా జాగ్రత్త పడతారో, వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది. వారికెలాంటి భీతిగానీ, దుఃఖంగానీ ఉండదు”.[అల్-బఖర/262]
ఉపకారాన్ని చాటుకొని మీ దానధర్మాలను వ్రధా చెసుకోకండి:
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تُبْطِلُوا۟ صَدَقَٰتِكُم بِٱلْمَنِّ وَٱلْأَذَىٰ كَٱلَّذِى يُنفِقُ مَالَهُۥ رِئَآءَ ٱلنَّاسِ وَلَا يُؤْمِنُ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْءَاخِرِ ۖ فَمَثَلُهُۥ كَمَثَلِ صَفْوَانٍ عَلَيْهِ تُرَابٌۭ فَأَصَابَهُۥ وَابِلٌۭ فَتَرَكَهُۥ صَلْدًۭا ۖ لَّا يَقْدِرُونَ عَلَىٰ شَىْءٍۢ مِّمَّا كَسَبُوا۟ ۗ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَٰفِرِينَ
ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్ ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి. అతని ఉపమానం కొద్దిగా మట్టి పేరుకుని ఉన్న నున్నని రాతి బండ వంటిది. దానిపై భారీవర్షం కురిసి, ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయి, కటికరాయి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రదర్శనా కారులకు తాము చేసుకున్న దానిలో నుంచి ఏమీ ప్రాప్తించదు. అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.[అల్-బఖర/264]
హదీసులలో ఈ విషయం కూడా ప్రస్థావించడం జరిగింది అదేమిటంటే మీరు ఏ పరిమాణంలో ఈ దానధర్మాలు చెస్తున్నారో అది ముఖ్యం కాదు, ఒకవేళ పరిమాణంలో తక్కువ ఉన్నా కాని పవిత్ర హృదయంతో చేస్తే అల్లాహ్ దానిని తప్పక స్వీకరిస్తాడు.
వ్యాఖ్యానించండి