కపటత్వం

మంగళ, 02/18/2020 - 19:40

కపటత్వం గురించి ఇమాం కాజిం[అ.స] ల వారి ఉల్లేఖనము.

కపటత్వం,ఇమాం కాజిం,వంచన.

ఇమాం కాజిం[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “చెడ్డ విశ్వాడుడెవడంటే రెండు ముఖాలను మరియు రెండు నాలుకలను కలిగి ఉన్నవాడు,ఎప్పుడైతే తన మతసోదరుని చూస్తాడో అతడిని ప్రశంసిస్తాడు.కానీ అతని వెనుక అతడిని తింటాడు[వీపు వెనుక అతని చాడీలు చెబుతాడు]”.

కపటత్వం అత్యంత వికారమైన లక్షణలలో ఒకటి. అంటే మానవుని బాహ్య స్వరూపం మరియు లోపలి స్వరూపం ఒకే మాదిరి,మనిషి యొక్క మాటలు మరియు చేతలు కూడా ఒకేలా ఉండాలి.ఒక వేళ ఆ రెండింటిలో తేడా ఉంటే అదే కపటత్వం మరియు వంచన.కపటత్వ వైఖరనేది ఇతరులను మోసం చేయటం లాంటిది.తీపి మాటలు మరియు ముఖస్తుతిని చేయటం ప్రాపంచిక ప్రయోజనాలు పొందటం కోసం చేసే అతి నీచమైన కార్యాలలో ఒకటి. రెండు నాలుకలున్న వాడు బయట ఇతరులను ప్రశంసిస్తాడు అదే వారి వీపు వెనుక వారి గురించి చెడుగా మాట్లాడుతాడు.అందుకే కపటత్వ వైఖరి కలిగి ఉన్నవారి గురించి దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “మీలో ఎవరూ ఇంకొకరి వీపు వునుక చెడుగా[చాడీలు] చెప్పుకోకూడదు.ఏమిటి,మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా?చూడండి,మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు.అల్లాహ్ కు భయపడండి” [అల్ హుజురాత్/12].

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,75వ భాగం,పేజీ నం:310.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8