రబీవుస్సాని యొక్క సందర్భాలు

సోమ, 12/18/2017 - 13:42

.రబీవుస్సాని(రబీవుల్ ఆఖర్) ఇస్లామీయ కేలండర్ ప్రకారం ఇది నాలుగొవ నెల. ఈ నెలలో జరిగిన కొన్ని సంఘటనల మరియు ప్రార్థనల వివరణ.

రబీవుస్సాని యొక్క సందర్భాలు

1వ తారీఖు: మిగిలిన ఇస్లామీయ నెల యొక్క మొదటి తారీఖున చదివే దుఆ మరియు నమాజ్ ను చదవాలి. అలాగే సయ్యద్ ఇబ్నె తావూస్ ఉల్లేఖించన ఈ దుఆ ...اللهم انت اله کل شی ను చదవాలి.
4వ తారీఖు: హిజ్రీ యొక్క 173 ఏట హజ్రత్ అబ్దుల్ అజీమ్[అ.స] జన్మించారు.
7వ తారీఖు: పై ఆకాశం వరకు షైతానుల రాకను నిలిపివేసిన రోజు. దైవప్రవక్త[స.అ] జన్మించిన 20 రోజుల తరువాత.
8వ తారీఖు: హిజ్రీ యొక్క 232వ ఏట సామెరా పట్టణంలో ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] జన్మించారు. (అల్లామా మజ్లిసీ, జాదుల్ మఆద్ లో మరియు షేఖ్ ముఫీద్ ఉల్లేఖనం ప్రకారం హజ్రత్ ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] రబీవుస్సాని యొక్క 10వ తారీఖున జన్మించారు).
10వ తారీఖు: ఇమామ్ అలీ రిజా[అ.స] సోదరి అయిన హజ్రత్ ఫాతెమా మాసూమహ్[అ.స] హిజ్రీ యొక్క 201వ ఏట మరణించారు.
14వ తారీఖు: ముఖ్తార్ ఇబ్నె అబీ ఉబైదె సఖఫీ, హిజ్రీ యొక్క 66వ సంవత్సరంలో కర్బలాలో అతిదారుణంగా చంపబడ్డ వీరుల ప్రతీకార కార్యాన్ని చేపట్టారు.(చరిత్రకారులలో కొందరు రబీవుల్ అవ్వల్ నెల 14వ తారీఖు అని కూడా వ్రాశారు).
22వ తారీఖు: హిజ్రీ యొక్క 292వ ఏట 9వ ఇమామ్, ఇమామ్ ముహమ్మద్ తఖీ[అ.స] యొక్క కుమారుడు “ముసా ముబ్రఖా” మరణించిన రోజు.
30వ రోజు: దైవప్రవక్త[స.అ] యొక్క భార్య “జైనబ్ బింతె ఖుజైమహ్” 4వ హ్రిజ్రీలో మరణించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6