ఒక ప్రముఖ సహాబీ జకాత్ చెల్లించలేదని, మరి జకాత్ ను నమాజ్ తో విడదీశారనే సాకుతో చంపారు...

ఒక ప్రముఖ సహాబీ జకాత్ చెల్లించలేదని, మరి జకాత్ ను నమాజ్ తో విడదీశారనే సాకుతో చంపారు. ఆ సాకును మరో ప్రముఖ సహాబీ విని “వారు చెప్పిన మాటలతో అల్లాహ్ నా హృదయం వికసించాడు” అని అన్నారు. అల్లాహ్, దైవప్రవక్త[స.అ] సున్నత్ ను వ్యతిరేకించే వారి హృదయాన్ని ఎలా వికసిస్తాడు!? ఈ విషయం విచారింపదగినదే.
నిజానికి ఈ సాకులన్నీ ముస్లిములతో యుధ్దం చేయవచ్చు అనేందుకు చేస్తున్న ప్రయత్నాలు. లేకపోతే ఖుర్ఆన్ స్పష్టంగా ప్రవచిస్తుంది:
“విశ్వాసించిన ప్రజలారా! మీరు అల్లాహ్ మార్గంలో “జిహాద్” కొరకు బయలుదేరినప్పుడు, మిత్రుడు శత్రువుల మధ్య విచక్షణ చేయండి. మీ వైపునకు సలాము చేస్తూ ముందుకు వచ్చేవాణ్ణి, “నీవు ముస్లిమువు కావు” అని త్వరపడి అనకండి. మీరు గనుక ప్రాపంచిక ప్రయోజనాలను పొందగోరితే, అల్లాహ్ వద్ద మీకొరకు విజయధనాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనికి పూర్వం స్వయంగా మీరూ ఇదేస్థితిలో ఉన్నారుకదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని కనికరించాడు. కనుక వివేచనతో వ్యవహరిచండి. మీరు చేసేదంతా అల్లాహ్కు బాగా తెలుసు[నిసా:94]
వ్యాఖ్యానించండి