ఖాలిద్ బిన్ వలీద్ చేసిన ఘనకార్యం

బుధ, 02/26/2020 - 17:15

చరిత్రలో ఉన్న ఇదొక విషాధగాథ. ఇందులో ఒక సహాబీ గుణాన్ని కళ్ళకు అద్దినట్లు చూపించారు...

ఖాలిద్ బిన్ వలీద్ చేసిన ఘనకార్యం

చరిత్రలో ఉన్న ఇదొక విషాధగాథ. ఇందులో ఒక సహాబీ గుణాన్ని కళ్ళకు అద్దినట్లు చూపించారు. ఆ తరువాత కూడా అతని ప్రస్తావన చాలా గౌరవప్రదంగా చేయమని మరియు అతన్ని “సైఫుల్లాహ్”(అల్లాహ్ యొక్క ఖడ్గం(అనగా తన ఖడ్గాన్ని కేవలం అల్లాహ్ మార్గంలోనే ప్రయోగించే మనిషి)) అనే బిరుదుతో గుర్తుచేయమని కోరడం.
బనీతమీమ్ మరియు బనీయర్బూఅ యొక్క నాయకుడు. అతను శౌర్యం, దయ, సాహసంలో సుప్రసిధ్ధి కలిగిన “మాలిక్ బిన్ నువైరహ్” లాంటి పెద్ద సహాబీని చంపిన సహాబీ గురించి ఏమని చెప్పగలం. చరిత్రకారులు స్పష్టంగా ఉల్లేఖించారు ఖాలిద్, మాలిక్‌ను మోసగించాడు అని. ఎప్పుడైతే వాళ్ళు ఆయుధాలను విడిచి జమాత్ నమాజ్‌లో పాల్గోన్నారో వాళ్ళను తాళ్ళతో కట్టేశారు. మరి ఆ బంధీల మధ్య మాలిక్ భార్యం అయిన “లైలా బింతె మిన్హాల్”ను చూశాడు. ఆమె, సౌందర్యంలో ప్రసిధ్ధి చెందినది. కొన్ని ప్రస్తావనల ప్రకారంగా అరబ్ దేశంలో ఆమె కన్న సుందర స్త్రీ ఉండేది కాదు. అయితే ఖాలిద్ ఆమె సౌందర్యంపై మోహితుడైయ్యాడు. మాలిక్ స్పష్టంగా చెప్పేశారు: “ఖాళీద్ మమ్మల్ని అబూబక్ర్ వద్దకు పంపేయి అతనే మా గురించి తీర్మానిస్తారు” అని. “అబ్దుల్లాహ్ బిన్ ఉమర్” మరియు “అబూ ఖతాదయే అన్సారీ” కూడా వాళ్ళను అబూబక్ర్ వద్దకు పంపేయండి అతనే తీర్మానిస్తారు, అని అన్నారు. కాని ఖాలిద్ వాళ్ళ కోరికలన్నీంటిని నిరాకరించి ఇలా అన్నాడు: “నేను అతనిని చంపకుండా వదిలేసినట్లైతే అల్లాహ్ నన్ను క్షమించడు” ఇది విని మాలిక్ తన భార్య వైపు చూసి ఇలా అన్నారు: “ఖాలిద్! అసలు నా చావుకి మూలం ఈ ఆడదే” అది విని ఖాలిద్, అతని శిరస్సును వేరుచేసి, లైలాను బంధించి అదే రాత్రి ఆమె పై అత్యాచారం చేశాడు.[అబుల్ ఫిదా, భాగం1, పేజీ 158]

రిఫరెన్స్
అబుల్ ఫిదా, భాగం1, పేజీ 158. యాఖూబీ, భాగం2, పేజీ 110. తారీఖె ఇబ్నె షహ్నా బర్ హాషియయే కామిల్, భాగం2, పేజీ 114. వఫియాతుల్ ఆయాన్, భాగం6, పేజీ14.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6