అహ్లెబైత్[అ.స] పట్ల విధేయత విముక్తికి కారణం అని ఉల్లేఖించారు ఆ ఓడపై ఎక్కారా లేదా?
ఇబ్నె హజర్, తన గ్రంథం “సవాయిఖుల్ ముహ్రిఖహ్”లో అహ్లెబైత్[అ.స] విముక్తి నౌక మరియు హత్తాహ్ ద్వారము అనగా వారి పట్ల విధేయత మరియు వారి పట్ల ఇష్టం మనిషి విముక్తికి కారణం అని ఉల్లేఖించారు. అయితే స్వయంగా ఇబ్నె హజర్ను “మీరు ఈ విముక్తి ప్రసాదించే ఓడపై ఎక్కారా? మీ ఈ ద్వారం నుండి ప్రవేశించారా? వారిని మార్గదర్శకులుగా అంగీకరించారా? లేకపోతే మీరు కూడా చేప్పేదొకటి చేసేదొకటా?, మరి తమ విశ్వాసానికి వ్యతిరేకంగా అమలు చేసే వాళ్ళలో వారా?” అని ప్రశ్నించే అవకాశం ఉంటే ఎంతబాగుండేదో. ఇలాంటి అంధకారంలో తడబడుతున్న వాళ్ళతో ప్రశ్నించినప్పుడల్లా వాళ్ళు ఇచ్చే జవాబు ఇదే: “మేము అహ్లెబైత్[అ.స]ను గౌరవిస్తాము, మేము వాళ్ళ ప్రతిష్టతలను అంగీకరిస్తాము మరియు వాళ్ళ ప్రతిష్టతలను నిరాకరించేవారేవ్వరూ లేరు”.
రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.
వ్యాఖ్యానించండి