అహంభావం లేని వ్యక్తిత్వం

సోమ, 03/09/2020 - 13:31

ఇమాం అలి[అ.స] ల వారి అహంభావం లేని స్వభావాన్ని వివరించే ఒక సంఘటన.

గర్వం,ఇమాం అలి,వ్యక్తిత్వం.

ఒక రోజు ఇమాం అలి[అ.స] ల వారు కూఫా దారి గూండా అంబార్ అనే ప్రదేశానికి చేరుకున్నారు.ఈ ప్రదేశం ఇంతకు ముందు ఇరాన్ భూభాగంలో ఉండేది.ఇమాం అలి[అ.స] ల వారు విచ్చేస్తున్నారన్న వార్త ఆ ఇరానీయులకు తెలిసింది.ఆ ప్రాంతపు వాసులు మరియు పెద్దలు ఖలీఫాల వారిని స్వాగతించుటకు వెళ్ళారు.వారు[ఇరానీయులు] ఇమాం అలి[అ.స] ల వారిని తమ సాసానిడ్ రాజుల వారసునిగా భావించి ఇమాం అలి[అ.స] లా వారు వచ్చినప్పుడు వారి ముందు పరిగెత్తటం మొదలుపెట్టారు.ఇమాం అలి[అ.స] ల వారు వారితో “మీరెందుకు ఇలా చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.దానికి వారు “మేము మా పెద్దలను మరియు మా పాలకులను ఈ విధంగా గౌరవిస్తాము” అని అన్నారు.అప్పుడు ఇమాం అలి[అ.స] ల వారు “వద్దు మీరు ఈ విధంగా చేయవద్దు.ఈ పని మిమ్మల్ని అవమానపరిచినట్లు మరియు కించపరిచినట్లు చేస్తుంది.మీరు ఎందువలన మీ ఖలీఫా అయినటువంటి నా ముందు[మిమ్మల్ని మీరే] కించపరుచుకుంటున్నారు? నేను కూడా మీలో ఒకడినే.ఇప్పుడు మీ ఈ పని వలన నాలో అహంకారం పుట్టుకురావచ్చు మరియు నేను మీకన్నా గొప్పవాడిననే స్వభావం నాలో కలగవచ్చు” అని అన్నారు.

రెఫరెన్స్: గుఫ్తార్ హాయె మానవి,ముర్తజా ముతహ్హరి,పేజీ నం: 24.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 23