ఇతరులను గౌరవించే స్వభావం

సోమ, 03/09/2020 - 14:49

ఇతరులను గౌరవించి వారిని ఆదుకోవటం అనేది మానవుని స్వభావము కావాలని తెలిపే ఒక సంఘటన.

ఇతరులు,ఇమాం అలి,గౌరవించటం

ఒక వ్యక్తి ఇమాం అలి[అ.స] ల వారి వద్దకు వచ్చి నేను అవసరపరుడిని[పేదవాణ్ణి] అని అన్నాడు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు “నీ అవసరాన్ని నేలపై రాయి,నేను నీ కష్టాన్ని నీ ముఖములో చూస్తున్నాను” అని అన్నారు.ఆ వ్యక్తి “నేను అవసరమున్న ఒక పేదవాడిని” అని నేలపై రాశాడు.ఇమాం అలి[అ.స] ల వారు ఖంబర్ తో రెండు విలువైన వస్త్రాలతో అతనిని కప్పుము అని అన్నారు.ఆ అవసరపరుడైన వ్యక్తి కొన్ని కవిత పద్యాలతో ఇమాం అలి[అ.స] ల వారికి కృతజ్ఞత తెలిపాడు.అప్పుడు ఇమాం అలి[అ.స] ల వారు ఒక వంద దీనారులు కూడా అతనికి ఇవ్వమని ఆదేసించారు. అప్పుడు కొందరు "ఓ అమీరుల్ మొమినీన్! మీరు అతడిని ధనవంతున్ని చేశారు అని అన్నారు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు “నేను దైవప్రవక్త[స.అ.వ] ల వారు చెప్పగా విన్నాను వారు ఈ విధంగా సెలవిచ్చారు: ప్రజలను వారికి తగిన స్థానంలో ఉంచి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించండి” అన్నారు.తిరిగి ఇమాం అలి[అ.స] ల వారు "కొంత మంది పట్ల నాకు ఆశ్చర్యమేస్తుంది వారు డబ్బుతో సేవకులను కొంటారు కానీ స్వతంత్రులైన [సాధారణ ప్రజలను] వారి మంచి కార్యాలతో కొనరు” అని అన్నారు.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,41వ భాగము,పేజీ నం: 34.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27