సోమ, 03/09/2020 - 18:07
తను ఎవరికి ఋణగ్రస్తుడై ఉన్నారో తెలిపే ఇమాం అలి[అ.స] ల వారి ఉల్లేఖనము...
ఒక రోజు ఇమాం అలి[అ.స] ల వారు దైవప్రవక్త[స.అ.వ] ల వారి వద్దకు విచ్చేసినప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు అబుల్ హసన్ ఎలా ఉన్నారు? అని ప్రశ్నించారు.దానికి ఇమాం అలి[అ.స] ల వారు నాకు ఎనిమిది మంది ఋణదాతలు ఉన్నారు[వారికి నేను ఋణపడి ఉన్నాను] అన్నారు.
1.అల్లాహ్ నా నుండి వాజిబాత్ ను కోరుకుంటున్నాడు.
2.మీరు నా నుండి మీ సున్నతును కోరుకుంటున్నారు.
3.నా కార్యాలను రాసే వారు నా నుండి సత్యాన్ని ఆశిస్తున్నారు.
4.ప్రాణాన్ని తీసే దైవదూత నా ప్రాణాన్ని తీయలనుకుంటున్నాడు.
5.నా కుటుంబం నా నుండి జీవనాధారాన్ని కోరుకుంటుంది.
6.షైతాను నా నుండి పాపాలను ఆశిస్తున్నాడు.
7.నా ప్రాణం నా నుండి స్వాదిష్టాన్ని కోరుకుంటుంది.
8.ఈ లోకం తనను స్వీకరించాలని కోరుకుంటుంది.
రెఫరెన్స్: నసాయెహ్,పేజీ నం: 281.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి