దైవప్రవక్త[స.అ] హదీస్ పై ఇబ్నె హజర్ శీర్షిక

శుక్ర, 03/13/2020 - 17:27

అహ్లెబైత్[అ.స] విధేయత దైవప్రవక్త[స.అ] ఆశ్రయానికి కారణం అని నిదర్శిస్తున్న రివాయత్ పై ఇబ్నె హజర్ విమర్శలు...

దైవప్రవక్త[స.అ] హదీస్ పై ఇబ్నె హజర్ శీర్షిక

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “ఎవరైతే నామాధిరి జీవించాలని, నా మాధిరి మరణించాలని మరియు శాశ్వతంగా అల్లాహ్ సృష్టించిన స్వర్గం ఉధ్యానవనంలో ఉండే ఆశ గనుక ఉంటే నా తరువాత అలీ[అ.స] మరియు వారి అనుచరులను ఇష్టపడండి. నా అహ్లెబైత్[అ.స]లకు విధేయులై ఉండండి. వీరే నా ఇత్రత్ వీరు నా మాధిరి సృష్టించబడ్డారు. వీరికి నా జ్ఞానం, నా తెలివి ప్రసాదించబడ్డాయి. నా ఉమ్మత్‌లో వీరి ప్రతిష్టతను నిరాకరించినవాళ్ళ కొరకు మరియు వారి నుండి దూరమైనవాళ్ళ కొరకు నరకం (వేచివుంటుంది). మరి వాళ్ళకు ఏమాత్రం నా ఆశ్రయం ఉండదు”[ముస్తద్రక్, భాగం3, పేజీ128]
ఇబ్నె హజర్ ఈ హదీసు తరువాత ఇలా ఒక శీర్షిక వ్రాశారు: ఈ హదీసును ఉల్లేఖించిన రావీయుల క్రమంలో “యహ్యా బిన్ యోలా” ఉన్నాడు. అతను జయీఫ్(భరోసా చేయలేని గల వ్యక్తి) మరియు అసందర్భ ప్రలాపము గలవాడు, దాంతో ఇది తప్పుడు హదీస్ అని మరి ఆ రావి మాటలు నమ్మదగినవి కాదని అర్ధమౌతుదం.
కాని యదార్థం “మునాఖిషాతు అఖాయిదియ్యహ్ ఫీ మఖాలాతి ఇబ్రాహీమిల్ జిబ్హాన్” అను పుస్తకం చదివితే తెలుస్తుంది. అందులో ఆ పుస్తక రచయిత “యహ్యా బిని యోలా ముహారిబీ”ను ప్రతీతుడనే నిజాన్ని ప్రకటించారు. మరి అతనిపై “బుఖారీ” మరియు “ముస్లిం” లాంటి ముహద్దిసీన్లు భరోసా చేశారు, అని వ్రాశారు. ఇమామ్ “బుఖారీ”, “బాబొ గజ్వతుల్ హుదైబియహ్”లో తన పుస్తకం సహీ బుఖారీ లో భాగం3, పేజీ 31లో ఈ రివాయత్‌ను ప్రవచించారు. మరి అలాగే “ముస్లిం”, “బాబుల్ హుదూద్, భాగం5, పేజీ 119”లో ఈ రివాయత్‌ను లిఖించారు. మరి స్వమతపక్షపాతం గలవాడైన “జహబీ” కూడా అతడి స్థైర్యమును గురించి అంగీకరించారు. మరియు అలాగే “ఆయిమ్మయే రిజాల్”(రావీల పుట్టపూర్వోత్రాలు బాగా తెలిసిన వారు)లు అతడిని ప్రతీతగల రావీయుల క్రమంలో స్థానమిచ్చారు.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12