నకిలీ హదీసుల తయారికి కారణాలు

సోమ, 03/16/2020 - 04:24

నకిలీ మరియు తప్పుడు హదీసుల తయారికి కారణాలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ....

నకిలీ హదీసుల తయారికి కారణాలు

స్వమతపక్షపాతానికి గురి అయి అల్లాహ్ ఉపదేశాలను మరిచి ముస్లిము హదీస్ ఉల్లేఖులు మరియు ఉలామలలో కొందరు నిజాలను దాచేయాలని, అవి సాధారణ ప్రజలకు తెలియకూడదని అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకు వాళ్ళు ఒక్కోసారి సరైన హదీసులకు కూడా తప్పుడు వ్యాఖ్యాలు సృష్టించి వాటికి వింత వింత అర్ధాలు చెబుతూ ఉంటారు. అలాగే ఒక్కోసారి ప్రతీతగల హాదీసులు “సహ్హా” మరియు “మసానీద్‌” గ్రంథాలలో ఉన్నాసరే నిరాకరించేస్తారు. మరి ఒక్కోసారి రావీలను “జయీఫ్‌”గా నిర్ధారించి వాళ్ళ మాటకు విలువలేకుండా చేస్తారు. ఒక్కోసారి తమకు అనుకూలంగా ఉండాలని హదీసులో సగభాగం లేదా పావుభాగాన్ని తొలగించేస్తారు. ఒక్కోసారి ఒక ఎడిషన్‌లో వ్రాసింది రెండవ ఎడిషన్ నుండి తొలగించేస్తారు. మరి ఇలా ఎందుకు చేశారనే కారణాలను కూడా ప్రస్తావించరు. వాళ్ళుచేసే పనులకు అసలు కారణాలేమిటో పరిశోధకులకు తెలుసు, అని వాళ్ళకు కూడా తెలుసు.
ఈ గౌరవనీయులైన ఉలమాలు సహాబీయుల ప్రతిష్టతను కాపాడడం కోసం ఇలా నకిలీ రివాయత్‌ల తయారీ, తప్పుడు ప్రస్తావనలు చేసే బదులు మరియు వ్యాఘాత ఉల్లేఖన లేదా చరిత్ర సత్యాలతో స్పష్టంగా ఢీకొనే బదులు నిజాన్ని అంగీకరించినట్లైతే వాళ్ళకు కూడా శాంతి దక్కేది మరియు ప్రజలు కూడా వాళ్ళ దుర్మార్గం నుండి సురక్షితంగా ఉండే వారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఉమ్మత్‌లో ఉన్న దూరాన్ని తగ్గించిన మరియు వారిలో ఐక్యత, సంధిని కలిగించిన పుణ్యం కూడా దక్కేది.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13