ప్రపంచంలోని ప్రతీ ముస్లిం ఈ సూరాను రోజుకి పది సార్లు ఎలాగైనా పఠిస్తాడు(నమాజులో), ఈ సూరాను పఠించకుండా ఏ ఒక్కరి నమాజు కూడా దేవుని సన్నిధిలో స్వీకరించబడదు.
సూరయే హంద్ యొక్క చాలా ప్రాముఖ్యతలు ప్రస్థావించబడ్డాయి అందులో ఒకటి ఖురాన్ లోని అన్ని సూరాలలో అల్ హంద్ యొక్క ఉత్తమమైన లక్షణం, దీని గురించి హదీసులలో ఈ విధంగా ప్రస్థావించడం జరిగింది:
మహప్రవక్త[స.అ.వ] ఈ విధంగా సెలవిచ్చారు:
''لو أن فاتحة الكتاب وضعت في كفة الميزان ، ووضع القرآن في كفة ، لرجحت فاتحة الكتاب سبع مرات''
''ఫాతెహతుల్ కితాబ్ (అల్ హంద్) ను తరాజూ(త్రాసు, తక్కెడ) యొక్క ఒక పళ్ళెములో మరియు మొత్తం ఖురాన్ ను వేరే పళ్ళెములో ఉంచినట్లైతే సూరయే "అల్ హంద్" యొక్క భారం ఏడు రెట్లు ఎక్కువ''[ముస్తద్రకుల్ వసాఇల్, 4వ భాగం, పేజీ నం:330].
దీనికి అర్ధం ఏమిటంటే "అల్ హంద్" యొక్క శ్రేష్టత్వం వేరే సూరాల శ్రేష్టత్వం కన్నా ఏడు రెట్లు ఎక్కువ అని అర్ధం.
వేరే హదీసులో ఉబై ఇబ్నే కఅబ్ ఈ విధంగా చెప్పారు: నేను మహనీయ ప్రవక్త[స.అ.వ] ముందు సూరయే అల్ హంద్ ను పఠించాను అప్పుడు ఆయన ఈ విధంగా సెలవిచ్చారు:
''والذي نفسي بيده ، ما انزل الله في التوراة والإنجيل ، ولا في الزبور ولا في الفرقان ،مثلها ،هي ام الكتاب ، وام القرآن ، وهي السبع المثاني ، وهي مقسومة بين الله وبين عبده، ولعبده ما سأل''
ఆ దేవుడు మీద ప్రమాణం తన చేతిలో నా ప్రాణములు ఉన్నాయి, అల్లాహ్ తౌరాత్ లో మరియు బైబిల్ లో మరియు జబూర్లో మరియు ఫుర్ఖాన్(ఖురాన్)లో ఇలాంటి సూరాను పొందుపరచలేదు, ఈ సూరా "ఉమ్ముల్ కితాబ్" మరియు "ఉమ్ముల్ ఖురాన్" మరియు "సబ్ఉల్ మసాని"(పురరావృతం అయ్యే ఏడు ఆయతులు), దేవుడు తనకు మరియు తన దాసులకు మద్య ఈ సూరాను పంచడం జరిగింది. [ముస్తద్రకుల్ వసాఇల్, 4వ భాగం, పేజీ నం:330].
మహాప్రవక్త[స.అ.వ] ఈ సూరా శ్రేష్టత్వాన్ని ప్రస్తావిస్తూ ఈ విధంగా కూడా సెలవిచ్చారు: ఎవరైతే ఈ సూరాను పఠిస్తారో అతను ఖురాన్ యొక్క రెండు భాగాలు పఠించిన వారి మాదిరి, ఈ సూరా దేవుని తరపున తన దాసులకు ఒక వరము.
ఖురాన్ లోని సూరాలన్నింటికి వేర్వెరు ప్రాముఖ్యతలు ప్రస్తావించబడ్డాయి కానీ ఏప్పుడైతే ఈ సూరా మిగిలిన సూరాల కన్నా ఏడు రెట్లు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నదని మహప్రవక్త చెప్పారో అలాంటప్పుడు మిగిలిన సూరాలు ఈ అల్ హంద్ సూరాకు సాటి అని ఎలా చెప్పగలము!.
వ్యాఖ్యానించండి