జీవితంలో వచ్చే కష్టాలు కలకాలం ఉండిపోవు.. ప్రతీ కష్టంతో పాటే సౌలభ్యం ఉంది అని వివరిస్తున్న ఖుర్ఆన్ ఆయతులు...
ప్రజలు ఆపదలతో, కష్టాలతో మరియు వ్యాధులతో దిగులు చెందినప్పుడు వారిని ఇంకా భయానికి గురి చేయకుండా వారిలో ధైర్యాన్ని నింపాలి. వారిని శాంతిని చేకూర్చాలి, దిగులు పడకుండా అపారకృపాశీలుడైన సకలలోకాల సృష్టికర్త పై నమ్మకాన్ని పెంచాలి, త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయి, అన్న హామీ ఇవ్వాలి. పవిత్ర గ్రంథంలో ఇలా ఉపదేశించబడి ఉంది: “నిశ్చయంగా (ప్రతి) కష్టంతోపాటే సౌలభ్యం కూడా ఉంది”[ఇన్ షరహ్94:06]
అందుకని దిగులు చెందకుండా మరియు కలతకు గురికాకండా ఎక్కువగా సృష్టికర్త సన్నిధిలో క్షమాపణ కోరుతూ (ఇస్తిగ్ఫార్ చేయాలి) ఉండాలి. ఎందుకంటే పవిత్ర గ్రంథంలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “వారు క్షమాపణకై వేడుకుంటూ ఉండగా కూడా అల్లాహ్ వారిని శిక్షించడు”[అన్ ఫాల్:33]
ఓ అల్లాహ్ మమ్మల్ని క్షమించు. మాపై కరుణించు, మేము తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించు నిస్సందేహముగా నీవు అనంతకరుణామయుడవు మరియు అపార కృపాశీలుడవు.
వ్యాఖ్యానించండి