తమ అనుచరులకు ఇమాం అలి[అ.స] ల వారి తాకీదులు.
ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: "నీ విశ్వాసాన్ని దానం చేయటం ద్వారా సంస్కరించుకో మరియు నీ సంపదను జకాతు చెల్లిచటం ద్వారా కాపాడుకో మరియు ఆపదల యొక్క కెరటాలను ప్రార్ధనల ద్వారా నీ నుండి దూరము చేసుకో" [నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం:146].విశ్వాసమనేది కేవలం నమాజు,రోజా,హజ్ వంటి దైవాదేశాలను పాఠించటం మాత్రమే కాదు దానితో పాటు దానధర్మాలు కూడా అవసరం.ఎప్పుడైతే ఒక ముస్లిము ఇస్లాము యొక్క ఇతర నియమాలతో పాటు ఇతర పేదవారిని ఆదుకోవటాన్ని కూడా ఒక కర్తవ్యంగా భావిస్తాడో అప్పుడే సమాజంలో పేదవారు మరియు ధనికులు అనే భేదాలు తొలగిపోతాయ.దివ్యఖురానులో నమాజు నెలకొల్పమని వచ్చిన ప్రతీ ఆదేశంతో పాటు జకాతు యొక్క ప్రస్థావన కూడా వచ్చిందంటే దాని ప్రాముఖ్యతేమిటో తెలుస్తుంది. ఇమాం అలి[అ.స] ల వారి హదీసు అనుసారంగా జకాతు మీ యొక్క సంపదకు బీమా లాంటిదని చెప్పవచ్చు. ఎటువంటి ఆపదలో ఉన్నా తనతో మొరపెట్టుకోమని ఆ దేవుడు ఆదేశిస్తున్నాడు.దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తునాడు: మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే "మీరు నన్నే ప్రార్ధించండి.నేను మీ ప్రార్ధనలను ఆమోదిస్తాను" [అల్ గాఫిర్/60].తనతో మొరపెట్టుకోమని తాను ఆమోదిస్తానని చెప్పే ఆ కారుణ్యమూర్తి యొక్క ఆదేశాన్ని పెడచెవిన పెట్టేవాడు నిజంగా మూర్ఖుడే.
వ్యాఖ్యానించండి