ఏ విధంగా ఐతే ఒక వ్యక్తి చెడిపోవటానికి ఒక సమాజం కారణమవుతుందో అలాగే ఒక వ్యక్తి బాగుపడటానికి కూడ ఒక మంచి సమాజమే కారణమవుతుంది.
ఇస్లాంలో మనిషి జీవనవిధానానికి అవసరమైన జీవన వ్యవస్థ మరియు ఆజ్ఞలతో పాటు మంచి నైతిక విలువలను కూడా ప్రస్తావించడం జరిగింది, ఒక మనిషి ఎప్పుడు ఐతే మంచి నైతిక విలువలను కలిగి మంచి అలవాట్లు అలవర్చుకుంటాడో అప్పుడే ఒక మంచి సమాజం యొక్క ఏర్పాటుకు దారి సమకూరుస్తుంది. దైవప్రవక్త[స.అ.వ] ఇలా ప్రవచించెను: إنَّكُمْ لَنْ تَسَعُوا النَّاسَ بِأَمْوَالِكُمْ فَسَعُوهُمْ بِأَخْلَاقِكُمْ‘‘
అనువాదం: మీ సంపదతో మనుషుల హృదయాలను మీవైపు మళ్ళించుకోవటం అసాధ్యం, మీ మంచి ప్రవర్తన వలనే వారిని మీవైపు ఆకర్షించేటట్లు చేయవచ్చు.[మన్లా యహ్జరుహుల్ ఫఖీహ్, 4వ భాగం, పేజీ నం:394].
ఒకవేళ మీరు మీ సంపదతో మనుషులకు మీ మీద ప్రేమ లేక వేరే మంచి ప్రభావం కలిగేలా చేసుకోవాలనుకుంటే అది అసాధ్యం, ఎందుకంటే సంపద ఎప్పటికీ శాశ్వతం కాదు కానీ మీ యొక్క నైతిక స్వభావం ఎల్లపుడూ మీతోనే ఉంటుంది, మీరు వారితో మాట్లాడే నాలుగు మంచి మాటలు మరియు మీ మంచి నడవడిక ఎల్లపుడూ వారి హ్రుదయాలలో శాస్వతంగా నిలిచిపోతుంది.
మంచి నడవడిక ఎలా సాధ్యం అవుతుంది?
ఇమాం హసన్ అస్కరీ[అ.స]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: మంచి నడవడిక కోసం నీవు ఈ విధంగ చేస్తే చాలు అదేమిటంటే ఏ ప్రవర్తనను నువ్వు ఇతరుల ద్వారా కోరుకోవో నువ్వు కూడా వారితో ఆ విధంగా ప్రవర్తించకు[బిహారుల్ అన్వార్, 78వ భాగం, పేజీ నం:377].
వ్యాఖ్యానించండి