షాబాన్ మాసము ముగుస్తుంది

మంగళ, 04/14/2020 - 14:42

షాబాన్ మాసము ముగుస్తున్న తరుణంలో అబా సల్త్ కు ఇమాం రిజా[అ.స] ల వారి తాకీదులు.

షాబాన్ మాసము,ఇమాం రిజా,అబా సల్త్.

ఇమాం రిజా[అ.స] ల వారి అనుచరుడైన అబా సల్త్ ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు: నేను ఇమాం రిజా[అ.స] ల వారి వద్దకు వెళ్ళినప్పుడు వారు నాతో ఈ విధంగా సెలవిచ్చారు: షాబాన్ మాసము చాలా వరకూ గడిచిపోయింది.ఈ మాసములో చేయవలసిన కార్యాలలో వచ్చిన లోటును మిగిలిన రోజులలో  పూర్తి చేయండి.ఏదైతే మీ కొరకు లాభదాయకమో మరియు ఏది మీ కొరకు లాభదాయకం కాదో అది మీ చేతులలో ఉంది.ఇప్పుడు ఈ మాసంలో ఎక్కువగా ప్రార్ధన,ప్రాయశ్చితం మరియు ఖురాను పఠనం వంటివి చేయండి.పాపాలను మరియు ఆ దేవుని పట్ల అవిధేయతను చూపటాన్ని వదిలి ఆ దేవుని వైపుకు మరలి రండి.ఆ దేవుని నుండి మీ పాపాలకు ప్రాయశ్చితాన్ని కోరుకోండి తద్వారా అల్లాహ్ మాసము[రమజాన్] మొదలైనప్పుడు మీరు నిష్టమైన దాసుల వలే ఆ మాసములోకి ప్రవేశించగలరు. మరియు షాబాన్ మాసపు మిగిలిన రోజులలో ఈ విధంగా ఆ దేవునిని వేడుకుంటూ ఉండు: "అల్లాహుమ్మ ఇన్ లం తకున్ గఫర్త లనా ఫీ మా మజా మిన్ షాబాన ఫగ్ఫిర్ లనా ఫీమా బఖియ మిన్ హు".

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,ముహమ్మద్ బాఖిర్ మజ్లిసి,94వ భాగం,పేజీ నం:73.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10