మానవుని కష్టాలకు కారణం

బుధ, 04/15/2020 - 17:07

మానవుడు ప్రకృతి ధర్మాలకు అణుగుణంగా నడుచుకుంటే అతనిపై ఆ దేవుని యొక్క కృప ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతడు ఆ దేవుని యొక్క ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అతని జీవితం నాశనమయిపోతుంది

కష్టాలు,మానవుడు,కారణం.

కొన్ని రకాల ఆపదలకు మానవుని యొక్క ప్రవర్తన కూడా కారణమవుతుంది.దాని గురించి దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: [ఏమిటీ] మీపై ఆపద రాగానే దీని కన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా ఇదెక్కడి నుండి వచ్చిపడిందని అంటారా? "ఇది చేజేతులా మీరు కొనితెచ్చుకున్నదే'' అని [ఓ ప్రవక్తా!] వారికి చెప్పు.నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ దానిని చేయగల సమర్ధుడు [ఆలె ఇమ్రాన్/165].వేరొక చోట అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: ప్రజలు చేజేతులా చేసుకున్న[పాప] కార్యాల మూలంగానే భూమిలోనూ,సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది.వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లాహ్ వారికి చవిచూపించటానికి[ఇలా జరిగింది].బహుశా వారు [దీని వల్ల] దారికి తిరిగి రావచ్చేమోనని [కూడా ఈ విధంగా జరిగింది]. [అర్ రూం/41]. ఈ ఆయతు గురించి అయతుల్లాహ్ తబాతబాయి ఈ విధంగా సెలవిస్తున్నారు: మానవుని చర్యలు మరియు అతని బాహ్యప్రపంచానికి మధ్య లోతైన సంబంధం ఉంది.  మానవుడు ప్రకృతి ధర్మాలకు అణుగుణంగా నడుచుకుంటే అతనిపై ఆ దేవుని యొక్క కృప ఉంటుంది.ఎప్పుడైతే అతడు ఆ దేవుని యొక్క ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అతని జీవితం నాశనమయిపోతుంది.

రెఫరెన్స్: అల్ మీజాన్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ ఆన్,అయతుల్లాహ్ సయ్యద్ ముహమ్మద్ హుసైన్ తబాతబాయి.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5