తత్హీర్ ఆయత్ మరియ దైవప్రవక్త[స.అ] భార్యలు

బుధ, 04/15/2020 - 18:23

తత్హీర్ ఆయత్, దైవప్రవక్త[స.అ] భార్యలకు సంబంధించినది అని నిదర్శించేవారికి సంక్షిప్త సమాధానం.

తత్హీర్ ఆయత్ మరియ దైవప్రవక్త[స.అ] భార్యలు

తత్హీర్ ఆయత్: “ఓ ప్రవక్త అహ్లెబైత్! మీ నుండి (అన్ని రకాల) అపవిత్రతలను దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పవిత్రులుగా చేయాలన్నేది అల్లాహ్ అభిలాష”. దైవప్రవక్త[స.అ] పై వారి భార్య ఉమ్మెసల్మా[ర.అ] యొక్క గదిలో అవతరింపబడింది; దైవప్రవక్త[స.అ] హసన్, హుసైన్, ఫాతెమా మరియు అలీ[అ.స]ను పిలిచారు, ఒకే చోటుకి చేర్చి వారిపై దుప్పటి కప్పారు. ఆ తరువాత వారు[స.అ] ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ వీరు నా అహ్లె బైత్[అ.స]లు, కనుక అహ్లెబైత్ నుండి ప్రతీ అపవిత్రతను దూరంగా ఉంచు, మరియు వారిని పరిపూర్ణ పవిత్రత ద్వార పవిత్రంగా చేయి” ఉమ్మె సల్మా[ర.అ] ఇలా అన్నారు: “ఓ దైవప్రవక్త[స.అ] నేను కూడా వారిలో చేరగలనా?” దైవప్రవక్త ఇలా అన్నారు: “నీవు నీ స్థానంలో ఉండు, నీవు సజ్జనత్వం పైనే ఉన్నావు”[అల్‌సహీహ్, భాగం5, పేజీ351 మరియు 663]
ఈ ఆయత్ కు ముందు మరియు తరువాత వచ్చే ఆయతులలో దైవప్రవక్త[స.అ] యొక్క భార్యలను ఉద్దేశించి ప్రవచించబడి ఉంది, ఇలా అని ఆయత్ లో ఉన్న స్ర్తీలింగానికి సంబంధించిన వాక్యాల ద్వార తెలుస్తుంది. కాని “తత్హీర్ అయత్”లో స్ర్తీలింగం నుండి పుల్లింగం లేదా మిశ్రపదంలో మారిపోతుంది. దాని ద్వార తెలిసే విషయమేమిటంటే ఇది మిగిలిన ఆయతులకు సంబంధం లేని ప్రత్యేకమైన ఆయత్, ఇందులో వివిధ వారిని ఉద్దేశించి ప్రవచించబడి ఉంది.

రిఫరెన్స్
అల్ తిర్మీజీ, అల్ సహీహ్, భాగం5, పేజీ351 మరియు 663; అల్ హాకిమ్ అల్ నైషాబూరీ, అల్ ముస్తద్రక్ అలస్ సహీహైన్, భాగం2, పేజీ416.  వారు, బుఖారీ ప్రమాణం ప్రకారం ఈ రివాయత్ సరైనది అని అంటున్నారు; అల్ సీవ్తీ, అల్ దురర్ అల్ మన్సూర్, భాగం5, పేజీ167.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 12