.అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ రెండవ ఉత్తరాధికారి అయిన ఇమామ్ హసన్[అ.స] గురించి సంక్షిప్తంగా.
అల్లాహ్ తరపు నుండి నియమించబడ్డ దైవప్రవక్త[స.అ] యొక్క రెండవ ఉత్తరాధికారియే ఇమామ్ హసన్[అ.స]. తండ్రి ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] తల్లి ఫాతిమ బింతె ముహమ్మద్[అ.స]. పవిత్ర మాసం రమజాన్ 15వ తారీఖు, హిజ్రీ యొక్క 3వ ఏట మదీనహ్ లో జన్మించారు. అతని పేరు దైవప్రవక్త[స.అ], అల్లాహ్ ఆదేశం ప్రకారం “హసన్” అని పెట్టారు. తౌరైత్(యూదుల పవిత్ర గ్రంధం)లో వారి పేరు “షబ్బర్”. హసన్ మరియు షబ్బర్ పదాలు వేరైనా అర్ధం ఒక్కటే.
వారి తండ్రి హజ్రత్ అలీ[అ.స] మరణాంతరం అనగా రమజాన్ నెల హిజ్రత్ యొక్క 40వ సంవత్సరం నుండి సఫర్ నెల 50వ హిజ్రీ వరకు వారి ఇమామత్ పదవీ కాలం, అనగా 10 సంవత్సరాలు.
హిజ్రీ యొక్క 50వ ఏటా అతని భార్య ముఆవియా కపటానికి గురి అయ్యి తన భర్తకు విషమిచ్చింది. ఆమె పేరు జోదా బింతె అష్‌అస్ బిన్ ఖైస్. ఆ విషం ద్వారానే అతని మరణం సంభవించింది. అతని మృతదేహాన్ని వారి పితామహులైన దైవప్రవక్త[స.అ] సమాధి ప్రక్కన సమాధి చేయడానికి అడ్డుకున్నారు. అప్పుడు అతని సోదరుడైన ఇమామ్ హుసైన్[అ.స] అతని పవిత్ర దేశాన్ని వారి తల్లి హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] సమాధిి ప్రక్కన “జన్నతుల్ బఖీ”లో సమాధి చేశారు. [ముంతహల్ ఆమాల్, ఇమామ హసన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం]
రిఫ్రెన్స్
షేఖ్ అబ్బాసె ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ హసన్[అ.స]కు సంబంధించిన అధ్యాయం.
వ్యాఖ్యానించండి