.అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్త హజ్రత్ ఈసా[అ.స] గురించి ఖుర్ఆన్ వివరణ.
యూదులు హజ్రత్ హజ్రత్ ఈసా[అ.స]ను హతమార్చాము అని మరియు వారిని శిలువ పై ఎక్కించాము అని భావించేవారు. అదే విధంగా హజ్రత్ ఈసా[అ.స] అనుచరులు కూడా హజ్రత్ ఈసా[అ.స] మరణించారు అని అనుకునే వారు. కాని అంతిమ గ్రంథం ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్[స.అ] అవతరణ ద్వార ఇంతకు ముందు పంపించబడిన మతాలన్నీంటిని రద్దు చేసిన అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం. నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు, పైగా అల్లాహ్ ఆయన్ని తన వైపుకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధిక్యుడు, మహావివేకి.[నిసా/157,158].
ఈ ఆయత్ ల ద్వార తెలిసే విషయమేమిటంటే హజ్రత్ ఈసా[అ.స] మరణించలేదు, ఆయనను అల్లాహ్ తన వైపుకు ఎత్తుకున్నాడు. ఈ విధంగా హజ్రత్ ఈసా[అ.స] ప్రాణాలతో అల్లాహ్ వద్దే ఉన్నారు. అంతిమ దైవప్రవక్త[స.అ] యొక్క అంతిమ ఉత్తరాధికారి ప్రత్యేక్షమైనప్పుడు హజ్రత్ ఈసా[అ.స] కూడా వస్తారు.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya...
వ్యాఖ్యానించండి