దేవుని సామిప్యాన్ని పొందటానికి రంజాన్ ఒక అవకాశం

శుక్ర, 04/17/2020 - 16:51

ఎంతో ప్రాముఖ్యత మరియు ప్రత్యేకతలున్న పవిత్ర రమజాను మాసం ఆ దేవుని సామిప్యాన్ని పొందటానికి ఒక మంచి అవకాశం.అలాంటి మంచి అవకాసాన్ని వదులుకున్న వాడు తనకు తాను నష్టాన్ని చేకూర్చుకున్నవాడవుతాడు.

రమజాన్,సామిప్యం,అవకాశం.

పవిత్ర రమజాన్ మాసము ఆ దేవుని సామిప్యాన్ని పొందటానికి ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు.ఆ దేవుని సామిప్యాన్ని పొందటమంటే ఏమిటి?నిజంగా దాని అనుభవం ఎలా ఉంటుంది? సాదారణంగా జీవించే ఒక వ్యక్తి మరియు ఆ దేవుని సామిప్యాన్ని పొందిన వ్యక్తి యొక్క జీవితం మధ్య చాలా తేడా ఉంది.సాదారణంగా పవిత్ర మాసూముల సమాధుల వద్ద మనకు కొద్ది సేపు గడిపితేనే ఒక రకమైన మంచి అనుభూతి కలుగుతుంది అదే ఆ దేవుని సామిప్యన్ని పొందితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఆ దేవుని సన్నిధిలో మన పాపాలకు క్షమాపణ లభించినప్పుడు,మన ప్రార్ధనలు మరియు మంచి కార్యాలను కేవలం ఆ అల్లాహ్ కొరకే చేసినప్పుడు,కేవలం ఆ అల్లాహ్ కొరకే పాపాల నుండి దురంగా ఉన్నప్పుడు,ఒక్క నిమిషం కూడా ఆ అల్లాహ్ పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని పట్ల ధ్యాసను చూపినప్పుడు ఆ దేవుని సామిప్యం యొక్క అనుభవాన్ని పొందామని చెప్పవచ్చు. ఇలాంటి వారి లక్షణాలను దివ్యఖురాను ఈ విధంగా వివరిస్తుంది: “వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు.నమాజులను నెలకొల్పుతారు.మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ,బహిరంగంగానూ,ఖర్చుపెడతారు.చెడును సయితం మంచితనంతో పార ద్రోలుతారు.అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే” [అర్ రాద్/22].  

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7