రమజాన్ ప్రాముఖ్యతను వివరించే దైవప్రవక్త[స.అ.వ] హదీసులు

శుక్ర, 04/17/2020 - 18:13

రమజాన్ ప్రాముఖ్యతను వివరించే మహనీయ ప్రవక్త[స.అ.వ] ల వారి కొన్ని హదీసులు.

రమజాన్,దైవప్రవక్త,ప్రాముఖ్యత.

1.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: రమజాన్ మాసము ఎలాంటి మాసమంటే దాని యొక్క మొదటి భాగం ఆ భగవంతుని కారుణ్యం, మధ్య భాగం అతని క్షమాపణ మరియు చివరి భాగం నరకాగ్ని నుండి విముక్తి. [బిహారుల్ అన్వార్,93వ భాగం,పేజీ నం:342].

2.దైవప్రవక్త[స.అ.వ] ల వారు వేరొక హదీసులో ఈ విధంగా ఉల్లేఖించారు: నిశ్చయంగా ఈ పవిత్ర రమజాన్ మాసం యొక్క మొదటి రాత్రి ఆకాసపు ద్వారాలు తెరవబడతాయి మరియు అవి రమజాన్ యొక్క చివరి రాత్రి వారకు మూసుకుపోవు [బిహారుల్ అన్వార్,93వ భాగం,పేజీ నం:344].

3.మహనీయప్రవక్త[స.అ.వ] ల వారు రమజాను యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: ఒక వేళ ఆ దేవుని యొక్క దాసుడు ఈ పవిత్ర రమజాన్ మాసంలో ఏముందో [ఎటువంటి దేవుని దయ మరియు కృప దాగి ఉందో] తెలిస్తే అతను ఏడాది పొడవునా రమజాను అయ్యుంటే బాగుండునని కొరుకుంటాడు [బిహారుల్ అన్వార్,93వ భాగం,పేజీ నం:346].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18