బల్లిగ్ ఆయత్ ఎప్పుడు అవతరించబడింది

శని, 04/18/2020 - 17:49

బల్లిగ్ ఆయత్ ఎప్పుడు అవతరించబడింది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

బల్లిగ్ ఆయత్ ఎప్పుడు అవతరించబడింది

“గదీరె ఖుమ్” మక్కాకు కొన్ని మైళ్ళ దూరంలో, మదీనహ్‌కు వెళ్ళే మార్గంలో ఒకచోట ఉంది. హజ్జతుల్ విదా(దైవప్రవక్త[స.అ] చివరి హజ్) నుండి తిరిగి వస్తుండగా జిల్‌హిజ్ నెల 18వ తారీఖు(మార్చి 10వ తేది)న దైవప్రవక్త[స.అ] ఆ ప్రదేశం నుండి వెళ్తన్నప్పుడు ఈ ఆయత్ అవతరించింది: “ఓ ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుంచి నీపై అవతరింపజేయబడిన దానిని (ప్రజలకు) అందజెయ్యి....,” వారు[స.అ] అక్కడే ఆగిపోయారు. మక్కా నుండి వారితో పాటు వచ్చిన హాజీయులకి మరియు అక్కడ నుండి తమ తమ ప్రదేశాలకు వెళ్ళేందుకు విడిపోయేవారందరికి ఉపన్యాసమివ్వాలనుకున్నారు. దైవప్రవక్త[స.అ] ఆదేశానుసారం చెట్ల కొమ్మలతో ఒక ప్రత్యేక పీఠం తయారు చేయబడింది. జొహ్ర్ నమాజ్ తరువాత దైవప్రవక్త[స.అ] ఆ పీఠంపై ఎక్కారు. తన మరణానికి మూడు నెలల ముందు సాధారణ ప్రజలతో కూడి ఉన్న అతిపెద్ద సమ్మేళనంలో ప్రసంగించారు. అలీ[అ.స]ను తన ఉత్తరాధికారిగా నిర్ధారించారు.

రిఫరెన్స్
ఉపయోగపడే జ్ఞానపరమైన సంక్షిప్త వ్యాసాలు, islamintelugu.org

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21