నీ ప్రభువు వద్ద మిగిలి ఉండే సత్కార్యాలు

శని, 04/18/2020 - 18:50

మనము ఈ లొకంలో నాటే చెట్టు మనకు నీడ నిచ్చి,తన ఫలాలను ఇచ్చి ఏ విధంగా నైతే ఉపయోగపడుతుందో అదే విధంగా ప్రళయదినాన మనకు ఉపయోగపడేవి మనము చేసే సత్కార్యాలు మాత్రమే. మరియు అవి మన ప్రభువు వద్ద ఎల్లాప్పుడూ మిగిలి ఉంటాయి.

ప్రభువు,సత్కార్యాలు,దైవప్రవక్త.

ఇమాం ముహమ్మద్ బాఖిర్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ఒక రోజు దైవప్రవక్త[స.అ.వ] ల వారు తన తోటలో మొక్కను నాటుతున్న ఒక వ్యక్తి పక్క నుండి వెళుతూ అతనితో ఈ విధంగా ప్రశ్నించారు? నీకు ఏ చెట్టు అయితే దాని మూలాలు స్థిరంగా ఉంటాయో,దాని ఫలాలు తొందరగా పండ్లు అవుతాయో మరియు చాలా కాలం వరకు ఉంటాయో ఆ చెట్టును నాటడం గురించి చెప్పనా? అని ప్రశ్నించారు.దానికి ఆ వ్యక్తి తప్పక సెలవివ్వండి ఓ దైవప్రవక్తా! అని అన్నాడు.అప్పుడు దైవప్రవక్త[స.అ.వ] ల వారు నీవు సూర్యోదయ సమయాన మరియూ సూర్యోస్తమ సమయాన "సుబ్ హానల్లాహి వల్ హందు లిల్లాహి వ లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్" అని పలుకుము అన్నారు.ఒక వేళ ఈ విధంగా పలికితే ప్రతీ తస్బీహ్[దేవుని పవిత్రతను కొనియాడటం] బదులుగా స్వర్గంలో ఒక చెట్టు మొలవబడుతుంది,ప్రతీ చెట్టుకు ఒక్కో రకమైన ఫలాన్ని ఇస్తుంది మరియు అవి నిత్యం మిగిలి ఉండే సత్కార్యాలు.

రెఫరెన్స్: అల్కాఫి,2వ భాగం,పేజీ నం:506.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13