ఇన్నా అన్జల్నా సూరహ్ మరియు అహ్లెబైత్[అ.స]

మంగళ, 04/28/2020 - 14:02

ఇన్నా అన్జల్నా సూరహ్ మరియు అహ్లెబైత్[అ.స] మధ్య గల సంబంధాన్ని వివరిస్తున్న హదీస్...

ఇన్నా అన్జల్నా సూరహ్ మరియు అహ్లెబైత్[అ.స]

ఇన్నా అన్జల్నా సూరహ్ మరియు అహ్లెబైత్[అ.స] మధ్య గల సంబంధాన్ని వివరిస్తున్న హదీస్, ఈ రివాయత్ లో ఇమామ్ ముహమ్మద్ బాఖిర్[అ.స] ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఒకరోజు ఇమామ్ అలీ[అ.స], ఇమామ హసన్ మరియు ఇమామ్ హుసైన్[అ.స] ముందు ఖద్ర్ సూరహ్(ఇన్నా అన్జల్నా సూరహ్) ను పఠించారు, ఇమామ్ హుసైన్[అ.స] ఇమామ్ అలీ[అ.స]తో ఇలా అన్నారు: “మీరు ఈ సూరహ్ ను మనసుకు నచ్చే విధంగా చాలా బాగా చదివారు, అందుకు కారణం ఏమిటి?” ఇమామ్ అలీ[అ.స] ఇలా సమాధానమిచ్చారు: ఈ సూరహ్ అవతరించబడినపుడు దైవప్రవక్త[స.అ] నన్ను పిలిచి, ఈ సూరహ్ ను వినిపించారు. ఆ తరువాత నా కుడి భుజం పై చేయి వేసి ఇలా అన్నారు: “ఓ నా సోదరుడా, నా వసీ, నా తరువాత ఈ ఉమ్మత్ యొక్క వలీ, ఈ సూరహ్ నా తరువాత నీది మరియు నీ తరువాత నీ పిల్లలు హసన్ మరియు హుసైన్ దీ, ఈ సూరహ్ యొక్క కాంతి నీ మరియు నీ సంతానం యొక్క హృదయాలలో ఖాయిమె ఆలె ముహమ్మద్[అ.స] ప్రత్యేక్షమయ్యే వరకు వికసిస్తూనే ఉంటుంది”.

రిఫరెన్స్
కాఫీ, మర్హూమ్ కులైనీ, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, చాప్4, 1407హి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8