సబా సూరహ్

ఆది, 12/24/2017 - 17:08

.ఖుర్ఆన్ యొక్క 34వ సూరా ఇది. “సబా” యమన్ దేశానికి చెందిన ఒక అందమైన పట్టణం పేరు.

సబా సూరహ్

ఖుర్ఆన్ యొక్క 34వ సూరా ఇది. “సబా” యమన్ దేశానికి చెందిన ఒక అందమైన పట్టణం పేరు. ఈ సురాకు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 15వ ఆయత్. ఈ సూరాలో “సబా” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 2 సార్లు వచ్చింది. ఈ సూరాలో 54 ఆయత్‍లు, 885 పదాలు మరియు 3596 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరాలో అల్లాహ్ పదం 8 సార్లు వచ్చింది. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “లుఖ్మాన్” సూరా మరియు దీని తరువాత “జుమర్” సూరా అవతరించబడ్డాయి. ఈ సూరహ్ పేరు “సబా” అని పెట్టడానికి గల కారణం అందులో “సబా” పట్టణానికి సంబంధించిన ఒక సంఘటన ప్రస్తావన ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి హజ్రత్ ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే రాత్రిపూట “సబా” మరియు “ఫాతిర్” సూరహ్ లను పఠిస్తారో వారు ఉదయం వరకు అల్లాహ్ మరియు దైవదూతల రక్షణలో గడుపుతారు మరియు ఒకవేళ ఉదయం పూట పఠిస్తే ప్రతీ అనిష్టమునకు దూరంగా ఉంటారు, అతడికి ఇహపరలోకాల మంచి ప్రసాదించబడుతుంది”.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 13 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6