కొన్ని దుఆలు

గురు, 05/07/2020 - 14:18

పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ లో ఉన్న కొన్ని దుఆల యొక్క  తెలుగు అనువాదం...

కొన్ని దుఆలు

ఖుర్ఆన్ దుఆల తెలుగు అనువాదం
1. తల్లిదండ్రుల క్షమాపణ కోరటం: “మా ప్రభూ! నన్ను నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు”[ఇబ్రాహీమ్:41]
2. కరుణ మరియు క్షమాబిక్ష ప్రార్థన: “మా ప్రభూ! మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. ఇప్పుడు నీవు గనక మాకు క్షమాబిక్ష పెట్టి, మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము”[అఅరాఫ్:23]
3. అల్లాహ్ ప్రసన్నత: “నా ప్రభూ! నువ్వు నాకూ, నా తల్లి దండ్రులకూ ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను, నీ మెప్పును పొందే మంచిపనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో”[నమ్ల్:19]
4. నమాజ్ చేసే భాగ్యం కోసం: “నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు”[ఇబ్రాహీమ్:40]
5. ఆమాల్ అంగీకరణ కోసం: “మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు”[బఖరహ్:127]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9