పరలోకానికి ఆశించేవాడు మరియు ఇహలోకానికి ఆశించేవాడి గురించి ఖుర్ఆన్ ఎమని చేబుతుంది, మరి దేన్ని ఆశించడం మేలు అన్న అంశాల పై సంక్షిప్త వివరణ...
ఎవరయితే పరలోక పంటను ఆశిస్తాడో, మేమతనికి అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. మరెవరయితే ఇహలోక పంటను ఆశిస్తాడో అతనికి మేము అందులో నుంచే ఎంతో కొంత ఇస్తాము. ఇలాంటి వ్యక్తికి పరలోకంలో ఏ భాగమూ ఉండదు.[షూరా:20]
ఈ ఆయత్ ను కొంచె దృష్టి పెట్టి చూసినట్లైతే పరలోక పంటను ఆశిస్తున్నవాడికి అందులో సమృద్ధిని ఇస్తాము అని చెప్పబడుతుంది అంతేగాని ఇహలోక పంటను ప్రసాదించము అని అనబడలేదు. కాని ఇహలోక పంటను ఆశించేవారికి ఇక్కడే ఎంతోకంత ఇవ్వబడుతుంది కాని పరలోకంలో ఏ భాగమూ ఉండదు.
ఈ విధంగా చూసినట్లైతే ఇహలోకాన్ని ఆశించేవారు ఆశించినంతగా లభించదు. పరలోకాన్ని ఆశించిన వారు ఇహలోకంలో కూడా భాగమూ కలిగి ఉన్నారు. తేడా ఏమిటంటే ఇహలోక అభిలాషి ఖాళీ చేతులతో పరలోకానికి చేరుతాడు, పరలోక అభిలాషి చేతులు నిండుగా చేరుతాడు.[తఫ్సీరె నమూనహ్, భాగం20, పేజీ420]
రిఫరెన్స్
తఫ్సీరె నమూనహ్, ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, చాప్26.
వ్యాఖ్యానించండి